Wednesday, September 22, 2021

ఆర్‌.ఆర్‌.ఆర్‌ షూటింగ్‌కు అడ్డు పడుతున్న చిరు?

వరండాలో స్విచ్ఛాన్‌ చేస్తే వాకిట్లో లైటు వెలగడం అనేది అందరికీ తెలిసిందే. సినిమా పరిశ్రమలో కూడా ఏదో సినిమా విషయంలో జరిగే కొన్ని పరిణామాలు మరేదో సినిమాను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ కోవలోనే దర్శక ధీరుడు రాజమౌళి`ఎన్టీఆర్‌`చరణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా చిరంజీవి 153వ సినిమా కారణంగా ఇబ్బందులు పడుతోంది. ఇప్పటి వరకూ ఎలాగొలా సర్ధుకు పోయిన రాజమౌళి ఇక లాభం లేదని చరణ్‌తోనే డైరెక్ట్‌గా ఈ విధానం మార్చుకో అనేంత వరకు వచ్చింది.

బాహుబలి తర్వాత రాజమౌళి`ఎన్టీఆర్‌`చరణ్‌ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ సినిమా ప్రారంభం నుంచి అనుకున్న రేంజ్‌లో స్పీడ్‌ వర్క్‌ను పూర్తి చేసుకోలేక పోతోంది. ఇందుకు మేజర్‌ కారణం రామ్‌చరణ్‌. ఈయన కాల్షీట్స్‌ ప్రాబ్లమ్‌ కారణంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ నత్త నడకన సాగుతోంది. చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత అయిన కారణంగా ఆ సినిమా నిర్మాణం, విడుదల, ప్రమోషన్‌ అంటూ చరణ్‌ చాలా రోజులు ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ను ఇబ్బంది పెట్టాడు.

అయినా రాజమౌళి మిగిలిన ఆర్టిస్ట్‌ కాంబినేషన్‌ సీన్లు తీసుకున్నాడు. సైరా తర్వాత కొద్ది రోజులు సమయానికి సెట్స్‌కు వచ్చిన రామ్‌చరణ్‌ మరల మాటి మాటికీ లేట్‌గా రావడం, షూటింగ్‌ ఎగ్గొట్టడం చేస్తున్నాడట. కారణం అడిగితే చిరు నటిస్తున్న 153వ చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నానని చెపుతున్నాడట. ఆ సినిమాకు రామ్‌చరణ్‌ నిర్మాత అయిన విషయం తెలిసిందే.

ఇదే విషయమై కొద్ది రోజు క్రితం రాజమౌళి రామ్‌చరణ్‌తో.. ఈ విధానం మార్చుకో చెర్రీ. నువ్వు కూడా నిర్మాతవే కదా ఓ ఆర్టిస్ట్‌ ఆబ్సెంట్‌ వలన యూనిట్‌ ఎంత ఇబ్బంది పడుతుందో నీకు తెలిసిందే కదా. నీ వలన కాంబినేషన్‌ కాల్షీట్స్‌ మిస్‌ అయితే మరల అందరివీ ఒకేసారి సంపాదించడం చాలా కష్టం. ఈ సినిమా ఎలాగూ అయిపోవచ్చింది. ఆ బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్పు అన్నారట. దీంతో 153 సినిమా నిర్మాణ భాగస్వామి అయిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ప్రీ ప్రొడక్షన్‌ బాధ్యతలు అప్పగించి ఆర్‌ఆర్‌ఆర్‌కు షూటింగ్‌కు రెగ్యులర్‌గా వస్తున్నాడట రామ్‌చరణ్‌. అలా ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు చిరు అడ్డంకిగా మారారన్నమాట.

Latest Articles