“మీసాల పిల్ల” పీకింది

0

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదల అయి పరవాలేదని అనిపిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాటలు విడుదల అయిన దగ్గర నుండి ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఇందులో ముఖ్యంగా ‘మీసాల పిల్ల’ పాట ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఈ పాట లిరిక్స్ కొత్తగా ఉండడంతో పాటు మ్యూజిక్ కూడా రొమాంటిక్ గా అనిపిస్తుంది.

ఈ పాట విడుదల అయిన దగ్గర నుండి యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉండడం విశేషం. అంత వరకూ బాగానే ఉంది. అయితే ‘మీసాల పిల్ల’ అంటే ఆడపిల్లకు మీసాలు ఉండడం ఏంటి? అనే డౌట్ అందరికీ వచ్చినా.. వినడానికి బాగుందని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బయటికి పడాలంటే మాత్రం ఏదోలా ఉండేది. ఆడపిల్లలకి మీసాలు ఉండవు కదా.. మరి ఎలా పాడతారా బయట పాడడం ఆపేశారు చాలా మంది.

అయితే ఇటీవల ఓ యువకుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. తనకు తెలిసిన ఓ అమ్మాయి ముందు ‘మీసాల పిల్ల” అని అన్నాడట. అంతే ఆ అమ్మాయికి పట్టరాని కోపం వచ్చిందట. నాకు మీసాలు ఉన్నాయా అంటూ.. ఒక్కటి పీకిందట. దీనితో ఆ యువకుడు అవాక్కయ్యాడట. తాను ఎదో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో వాడిన లిరిక్ ని వాడానని.. రొమాంటిక్ గా ఉందని సదరు యువకుడు చెబుతున్నాడు.

ఏది ఏమైనా ‘మీసాల పిల్ల’ అంటే అమ్మాయిలకు మీసాలు ఉండడమే అని అర్ధం వస్తుంది కావున అమ్మాయిలకు అలానే అర్ధం అవుతుంది. మీరు కూడా ఈ పాట పాడుకోండి కానీ.. ఏ అమ్మాయి ముందు పాడే ధైర్యం చేయవద్దు. అలా చేస్తే మీ పని కూడా ఆ యువకుడికి ఎదురైన పరాభవం ఎదురవ్వచ్చు. జాగ్రత్త సుమీ.