డిస్నీ రూపొందించిన యానిమేటెడ్ ప్రీక్వెల్ “ముఫాసా: ది లయన్ కింగ్” ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నంలో బాగానే సక్సెస్ సాధిస్తోంది అనడంలో డౌట్ లేదు . “ది లయన్ కింగ్” పేరుతో రెండు సార్లు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ఫ్రాంచైజ్ ఇప్పుడు ముఫాసా జీవితాన్ని ప్రధానంగా చూపిస్తుంది. తెలుగులో ప్రముఖ నటుడు మహేష్ బాబు గాత్రదానం చేయడంతో ఈ చిత్రం ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది. పైగా ఈ మూవీలో అలీ, బ్రహ్మానందం కూడా తమ గాత్రంతో మంచి కామెడీ పండించారు.
కథ:
ముఫాసా, ఒక పెద్ద సింహం కొడుకుగా జన్మించి చిన్నప్పటి నుంచే తెలివి, వేగం, చురుకుదనంలో తనదైన ముద్ర వేసుకుంటాడు. కానీ ఒక విషాదకరమైన వరదలో తన తల్లిదండ్రులను కోల్పోయి, వేరే రాజ్యంలో అనాథగా జీవనం సాగించాల్సి వస్తుంది. అక్కడి రాజు ఒబాసికి ముఫాసా మీద ద్వేషం ఉండగా, అతడి భార్య, కొడుకు ముఫాసాను అక్కున చేర్చుకుంటారు. ఈ క్రమంలో తెల్ల సింహాల దాడి, పరిణామాలు ముఫాసాను తన నిజ స్వరూపాన్ని చాటుకునేలా చేస్తాయి.
విశ్లేషణ:
ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మంచి ప్రమాణాలను చూపించినప్పటికీ, కథలో ఎమోషన్ కాస్త మెదడులో దూరడం లేదు. పాటలు అసందర్భంగా కనిపించడం, సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోవడం చిత్రానికి నెగెటివ్ పాయింట్లుగా మారాయి. మహేష్ బాబు గాత్రదానం, బ్రహ్మానందం, ఆలీ వంటి హాస్యభరిత పాత్రల సంభాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ విజువల్స్, సాంకేతికత ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
ముఫాసా మంచి విజువల్స్ కోసం చూడదగ్గ సినిమా. కానీ కథ అంచనాలను అందుకోలేకపోయింది. తక్కువ అంచనాలతో చూస్తే మాత్రం ఈ చిత్రం సరదా అనిపించవచ్చు.
రేటింగ్: 2.5/5