కొందరిని నమ్మి మోసపోయాను.. వైరల్ అవుతున్న తమన్ స్టేట్మెంట్

0

త‌మ‌న్ ద‌క్షిణాది సినీ పరిశ్రమలో సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎలాంటి జాన‌ర్ సినిమాకైనా సరే త‌న మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో సినిమాను మరింత ఎలివేట్ చేస్తుంటాడు. ముఖ్యంగా మాస్ సినిమాల‌కు త‌మ‌న్ అందించే రీరికార్డింగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటుంది.

త‌మ‌న్ సంగీతంలో మాస్ ఎలిమెంట్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయి. అందుకే బాలయ్య సినిమాలకు ఆయ‌న ఇచ్చే మ్యూజిక్‌ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. వారి క‌ల‌యిక‌లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. రీసెంట్‌గా ‘డాకు మహారాజ్‌’ చిత్రానికి త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు హైలైట్‌ అయ్యింది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో బాలయ్య అభిమానులు తమన్‌ను ముద్దుగా ‘నందమూరి తమన్’ అని పిలుస్తున్నారు.

తాజాగా బాలకృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్‌ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. తన కెరీర్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, కొన్ని తప్పులు చేసానని, కొందరిని నమ్మి మోసపోయానని తమన్ చెప్పాడు. జీవితంలో ఎప్పుడో ఒక టైమ్‌లో మనం కొందరిని గుడ్డిగా నమ్ముతామని, తనూ అలానే నమ్మానని, అయితే తాను నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని అన్నారు. తనతో మంచిగా మాట్లాడి, బయటకు వెళ్లి చెడుగా మాట్లాడే వాళ్లు ఉన్నారని, తాను నమ్మిన కొందరికి డబ్బు ఇచ్చి కూడా చాలా నష్టపోయానని చెప్పుకొచ్చారు. కానీ ఈ అనుభవాలన్నీ తనకు పాఠాలుగా మారాయని, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నానని అన్నారు.

ఇక తమన్‌ విషయానికి వస్తే, త‌న‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్ట‌మ‌ని, ప‌ని ఒత్తిడి ఎక్కువైనప్పుడు క్రికెట్‌ ఆడడం ద్వారా రిలాక్స్‌ అవుతానని చెప్పాడు. చిన్నప్పటి నుంచి స్టార్‌ క్రికెటర్లు ఆడే గ్రౌండ్‌లో తాను కూడా ఆడాలని కలలుకన్నానని, కానీ అప్పట్లో అది సాధ్యపడలేదని, ఆ విషయమై చాలా బాధపడ్డానని చెప్పారు. కానీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ వల్ల తన ఆ కోరిక నెరవేరిందని, గత ఐదేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ తరపున ఆడే క్రికెట్‌ టీమ్‌లో భాగమయ్యానని తెలిపారు. తమన్‌ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, క్రికెట్‌ కోసం మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుంటాడు.

త‌మ‌న్ మ్యూజిక్‌లో ఓ ప్రత్యేకత ఉంది. అతని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సినిమాలకు అదనపు బలంగా మారుతాయి. అందుకే పెద్ద సినిమాలన్నీ తమన్‌ను దర్శకుడిగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మాస్ సినిమాలకు ఆయన మ్యూజిక్ అసాధారణమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణతో తమన్‌కు ఏర్పడ్డ బాండింగ్‌ సినిమాపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తోంది. అభిమానుల ప్రేమతో మరింత ఎత్తుకు వెళ్లాలని తమన్‌ భావిస్తున్నాడు.