
మ్యూజిక్ డైరెక్టర్‌గా తన మాస్ బీట్‌లతో అందరినీ ఊర్రూతలూగిస్తున్న తమన్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించి, సంక్రాంతి సీజన్‌లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాడు. గేమ్ ఛేంజర్ రిజల్ట్ అనుకున్నంత స్థాయిలో కాకపోయినా, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అందరికీ నచ్చింది. ఇక డాకు మహారాజ్ అయితే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్ల పరంగా ఆశించిన రీతిలో రాబట్టలేకపోయింది. పండుగ సీజన్ లో కూడా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్‌ను అందుకోలేకపోయిందంటే, అది ఓ విచిత్రమే. కానీ ఈ మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.
ఇదిలా ఉంటే, తమన్ మళ్లీ యాక్టింగ్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు. ‘బాయ్స్’ సినిమాలో నటించిన తరువాత, ఇప్పటి వరకు స్క్రీన్ మీద కనిపించని తమన్, ఇప్పుడు అథర్వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సంగీతంతో పాటు నటనపైన కూడా ఆసక్తి చూపిస్తూ, కొత్త ఛాలెంజ్‌ను అంగీకరించడం ఆసక్తికరంగా మారింది.
ఇక తమన్ ప్రైవేట్ లైఫ్ గురించి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని చెప్పిన ఆయన, ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో పెళ్లి అనేది అసలు అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్ అయ్యారని, ఎవరికైనా ఓపిక ఉండడం తగ్గిపోయిందని, విడాకులు తక్కువ సమయంలోనే జరుగుతున్నాయనే విషయాన్ని ప్రస్తావించాడు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయిందని, ఇన్‌స్టాగ్రామ్ వాడకం పెరిగిపోయిందని, దీనివల్ల మనుషుల మధ్య సంబంధాలు మారిపోయాయన్నారు. అందుకే, తనను ఎవరైనా పెళ్లి గురించి అడిగితే, తప్పకుండా పెళ్లి వద్దని చెప్పాలని తాను భావిస్తానని స్పష్టంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే, తమన్ ప్రస్ అఖండ 2 మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయాలని చూస్తున్నాడు. వెరసి సంగీత రంగంలోనే కాకుండా, నటనపైన కూడా మళ్లీ ఫోకస్ పెట్టిన తమన్, త్వరలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు.