డిసెంబర్ 4న శోభిత ధూళిపాలను అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏఎన్ఆర్ విగ్రహం సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం ఈ ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటు అక్కినేని ఫ్యామిలీతో పాటు అటు దగ్గుపాటి ఫ్యామిలీ కూడా ఈ వేడుకల్లో బాగా ఎంజాయ్ చేసింది. పెళ్లి అయిన వెంటనే నూతన వధూవరులు శ్రీశైలం మల్లన్నను నాగార్జునతో కలిసి దర్శించుకుని వచ్చారు. ఇక వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరో పక్క దగ్గుపాటి రానా హోస్ట్గా వ్యవహరిస్తున్న ది రానా టాక్ షో లో నాగచైతన్య గెస్ట్ గా పాల్గొన్నారు. ఇందులో అతనితో పాటు అతని కజిన్స్ కూడా సందడి చేశారు. ఈ షోలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి తో తండెల్ మూవీ చేస్తున్న నాగచైతన్య ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ షోలో మాట్లాడారు.
మరీ ముఖ్యంగా సినిమాతో సాయి పల్లవికి ఉన్న అనుబంధం గురించి వివరించిన నాగచైతన్య.. ఆమెతో డాన్స్ చేయడం అంత ఈజీ కాదు అని అలాగే సాయి పల్లవి ప్రతి చిన్న విషయానికి రిటై కడుగుతుందట.. అందుకే చాలాసార్లు మళ్లీమళ్లీ షార్ట్ కి వెళ్లాల్సి ఉంటుంది అని సరదాగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ లపై తన అనుభవం గురించి కూడా నాగచైతన్య స్పందించారు.
నాగచైతన్య ధూత అనే ఓ వెబ్ సిరీస్ ని చేసిన విషయం అందరికీ తెలిసిందే. వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్యకు కాస్త హోప్ అందించిన వెబ్ సిరీస్ ఇదే. ఇక మళ్లీ ఓటిటి కంటెంట్ చేసే అవకాశం ఉందా అంటూ వచ్చిన ప్రశ్నకు నాగచైతన్య తప్పకుండా.. ముందు ముందు అటువంటి ఛాన్సెస్ వస్తే కచ్చితంగా చేస్తాను అని అన్నారు. అంతేకాదు వెబ్ సిరీస్ చేసే టైంలో అస్సలు టెన్షన్ ఉండదని.. అదే సినిమా చేస్తే విడుదల, బుకింగ్స్, కలెక్షన్స్.. ఇలా ఎన్నో టెన్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. అంతే కాదు తాను భవిష్యత్తులో మరిన్ని వెబ్ సిరీస్ చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.. చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ చిత్రం కచ్చితంగా నాగచైతన్యకు ఓ మంచి కం బ్యాక్ ఇస్తుందని అందరూ భావిస్తున్నారు.