Wednesday, September 22, 2021

పంచాయితీ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం కూడా సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు సజ్జల తెలిపారు. అధికార పార్టీ గా తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

పంచాయితీ ఎన్నికలను ఓ రాజకీయ పార్టీగా తాము స్వాగతిస్తున్నామని, అయితే వ్యాక్సిన్ తీసుకోకుండానే ఎన్నికలకు ఉద్యోగులు వెళితే నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఏదైనా జరిగితే అందుకు ఎస్ఈసీ నే బాధ్యత వహించాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యము కోసమే ఇన్నాళ్లు తాము ఎన్నికలు వద్దని అనున్నామని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మధ్యలోనే ఆపి.. పంచాయతీ ఎలక్షన్ లు నిర్వహించడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ఎవరో ఒకరిపై బురద చల్లడమే నిమ్మగడ్డ పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన గంటలోనే కేంద్రానికి ఎస్ఈసీ లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించకుండా కేంద్రానికి లేఖ రాయడం పట్ల నిమ్మగడ్డ ఎవరికోసం పని చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. నిమ్మగడ్డ ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతారని.. కానీ వ్యవస్థలు శాశ్వతం అని సజ్జల తెలిపారు.

న్యాయ వ్యవస్థలకు, చట్టాలకు లోపబడి వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరుపున ఎవరు ఉన్నా.. వారి ఆదేశాలు పాటిస్తామని తెలిపారు. కానీ నిమ్మగడ్డ మాత్రం అధికారాలను జన్మహక్కులుగా భావిస్తుండడం వలెనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నారు.

Latest Articles