నందమూరి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎందరో వచ్చారు.. అయితే బలంగా వినిపించే పేర్లు మాత్రం బాలకృష్ణ, ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన నట వారసుడిగా మోక్షజ్ఞకు మంచి ఎంట్రీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. నందమూరి అభిమానులు కూడా మోక్షజ్ఞను హీరోగా చూడాలి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లాస్ట్ సంక్రాంతికి హనుమాన్ చిత్రంతో భార్య సక్సెస్ సాధించిన ప్రశాంత్ వర్మ.. డైరెక్షన్లో మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడానికి బాలయ్య సర్వం సిద్ధం చేశారు అన్న టాక్ నడుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.’యాక్షన్ కోసం సిద్ధంగా ఉన్నారా? సింబా వస్తున్నాడు’అంటూ అప్పట్లో కాస్త హడావిడి కూడా చేశారు. ఇప్పటిదాకా స్టొరీ అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఓ విషయం నందమూరి అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఒకప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి ప్లస్ గా భావించిన ప్రశాంత్ వర్మ ఈ టెన్షన్ కి కారణం అవ్వడం ఇక్కడ లేటెస్ట్ ట్విస్ట్..
ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన హనుమాన్ పెద్ద చిత్రాలను సైతం వెనక్కి నెట్టి బ్లాక్ పాస్టర్ హిట్ సాధించింది. దీంతో అతని పేరు ఓ క్రేజ్ గా మారిపోయింది. ఇక హనుమాన్ సీక్వెల్ చిత్రానికి సంబంధించిన స్టోరీ వర్క్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ మరోవైపు ఆల్రెడీ తాను రాసిన కొన్ని కథలను ఇతర డైరెక్టర్లకి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కించిన దేవకీ నందన వాసుదేవ చిత్రానికి కూడా ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు.
అనూహ్యమైన విజయం అందుకుంటుంది అనుకున్న ఈ చిత్రం కాస్త అటల్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. భారీ ప్రమోషన్స్ తో.. ప్రశాంత్ వర్మ స్వయంగా బ్రాండింగ్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ మూవీ చూసిన చాలామంది ఇలాంటి స్టోరీ కోసం ప్రశాంత్ వర్మ ఇంతగా ప్రమోట్ చేశారా.. అస్సలు ఈ జనరేషన్ ఆడియన్స్ కి ఏ మాత్రం కనెక్ట్ కానీ స్టోరీని ప్రశాంత్ వర్మ ఎలా అందించాడు అంటూ విమర్శిస్తున్నారు.
మరోపక్క మోక్షజ్ఞత ప్రశాంత్ వర్మ తెరకెక్కించే మూవీ పరిస్థితి ఏమిటో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎంత నందమూరి కుటుంబం నుంచి వచ్చిన డబ్ల్యూ చిత్రం అనేది హీరో సక్సెస్ కి ఎంతో కీలకము. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞను ఎలాంటి పాత్రలో చూపిస్తున్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.