టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ , ఆయన అసిస్టెంట్ శ్రేష్ఠ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయడంతో అరెస్టయ్యారు. కొన్ని వారాలు జైల్లో గడిపిన ఆయన ఇటీవలే బెయిల్పై విడుదల అయ్యారు. జైలులో ఉన్నప్పటికీ ఈ కేసు పలు మలుపులు తిరిగింది. బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ కొన్ని ఇంటర్వ్యూల్లో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెబుతున్నారు.
ఇక ఈ కేసులో ప్రధాన పాత్రధారి శ్రేష్ఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, “నేను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక మహిళను నిందితురాలిగా కాకుండా ఫైటర్గా చూడాలి. జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని నాకు ఆశ ఉంది. నాలాంటి అమ్మాయిలు ఎవరూ ఇబ్బందులు పడకూడదు, అందుకే నేనిలా ముందుకు వచ్చాను,” అని శ్రేష్ఠ అన్నారు.
జానీ మాస్టర్ తన విషయంలో పెద్ద తప్పు చేశారని, అందుకే తనపై కేసు పెట్టానని శ్రేష్ఠ చెప్పింది. ఈ వ్యవహారంలో ఇతర ఉద్దేశాలు ఏమాత్రం లేవని, దీనికి వెనుక ఎవ్వరూ లేరని స్పష్టం చేసింది. కొన్ని వ్యక్తులు తనపై డబ్బు కోసం హనీట్రాప్ చేసిందని, బ్లాక్ మెయిల్ చేసింది అనే ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ అసత్యమని ఆమె పేర్కొంది. “నాలుగు సంవత్సరాలుగా నాకు వేధింపులు ఎదురయ్యాయి. మొదటగా ధైర్యం లేక కేసు పెట్టలేదు. కానీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు కోర్టు చాటే న్యాయం కోరాను,” అని శ్రేష్ఠ వివరించింది.
తనపై వచ్చిన ఆరోపణలతో పాటు వ్యక్తిగత జీవితంపై వచ్చే విమర్శలను కూడా ఆమె ఖండించింది. “పదహారేళ్ల వయసులో నేను హనీట్రాప్ చేయడం ఎలా సాధ్యం? నేను ఇలాంటి ఆలోచనలు చేసే వయసులో లేను,” అంటూ సమాజానికి ప్రశ్నలు విసిరింది. తన పెళ్లి గురించి అడిగినప్పుడు, “ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అంటున్నారు.
కానీ నా ధైర్యాన్ని మిర్చి నా భార్య ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకుని ముందుకు వస్తే అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదు,” అని స్పష్టం చేసింది. శ్రేష్ఠ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.