దిశాని బతికి ఉండగానే పెట్రోల్ పోసి తగలపెట్టాం..! మహమ్మద్ ఆరిఫ్

0
9523

చనిపోయాక కాదు.. దిశాని బతికి ఉండగానే సజీవ దహనం చేశారు కామాంధులు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా హత్యా ఘటనలో మరి కొన్ని దారుణాలు బయటికి వచ్చాయి. దిశా అపస్మారక స్థితిలో ఉండగానే పెట్రోల్ పోసి తగలపెట్టామని.. జంకు లేకుండా ఏమాత్రం పచ్చాత్తాపం లేకుండా జైలు సిబ్బంది దగ్గర నోరు విప్పాడు ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆరిఫ్. ప్రస్తుతం దిశా హత్య కేసు నిందితులు చర్ల పల్లి జైలులో ఓ ప్రత్యేక నిఘాలో ఉన్నారు. వీరికి కాపలా కాస్తున్న కొంత మంది సిబ్బంది వారితో మాటా మాటా కలిపినప్పుడు.. ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలను ఈ నలుగురు బయట పెట్టినట్లు తెలుస్తుంది. ప్రధాన నిందితుడు ఆరిఫ్ చెబుతున్న దాని ప్రకారం.. ఒకసారి కాదు రెండు సార్లు దిశాపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది. దిశాని బలవంతంగా కళ్ళు చేతులు పట్టుకొని సమీప ప్రాంతానికి లాక్కొని వెళుతున్నప్పుడు ఆమె పెద్దగా కేకలు వేసింది.

మళ్ళీ ఆమె కేకలు వేయకుండా చెన్నకేశవులు తన జేబులో ఉన్న మద్యం సేసాని తీసి దిశా నోట్లో బలవంతంగా పోసాడు. అప్పటికే భయంతో ఆందోళనతో ఉన్న దిశా అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. వెంటనే ఆమెపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ప్రాణాల్తోనే ఉన్న దిశను లారీ ఎక్కించి అందులో కూడా అత్యాచారం చేశారు. దీనితో ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. పూర్తిగా నిచ్చదనంగా ఉన్న దిశా చనిపోయిందనుకొని వంతెన దగ్గరకు తీసుకొచ్చి బతికి ఉండగానే పెట్రోల్ పోసి తగుల పెట్టారు. ఆ ఘటనలో ఇంకా ఏమి జరిగిందనే విషయాలు ఒక్కొక్కటీ బయటికి వస్తున్నాయి. ఆమె ఫోన్ ఏమైందనే విషయం ఇంకా తెలియ రాలేదు. టైర్ పంచారు వేయిస్తామని ఆరిఫ్ చెప్పడంతో అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది దిశా. చివరి సారిగా అతడికే కాల్ చేసింది దిశా. దీనితో సెల్ ఫోన్ ఎక్కడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.