కాఫీ డే సిద్ధార్థ మరణంపై ట్విస్ట్.. ఆత్మహత్య కాదా?

0
1010

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాఫీ డే అధినేత సిద్ధార్థ మరణంపై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. తొలుత ఆత్మహత్య అని అనుకుంటున్నా.. ఇప్పుడు మాత్రం పోలీసులకు అనేక అనుమానాలు వస్తున్నాయి. సిద్ధార్థ మృత దేహం నదిలో నుంచి కొట్టుకొచ్చిన తరువాత చేతి ఉంగరాలు, ఫ్యాంటు, బూట్లు మాత్రమే ఉండగా.. ఆయన వేసుకున్న షర్ట్ ఒంటిపై లేదు. ఇంకా ఆత్మహత్య అని అనుకుంటున్నా.. ముప్పైఆరు గంటలు గడిచినా మృతదేహం దెబ్బ తినకపోగా.. ముక్కు నుంచి రక్తం కారుతున్న గుర్తులు మాత్రం తాజాగానే ఉన్నాయని వెల్లడి అవుతుంది. ఇప్పుడు ఇదే పోలీసులకు సరికొత్త అనుమానాలకు తావు ఇస్తుంది.

దీంతో అతడి కుటుంబ సభ్యులతో పాటు.. సిద్ధార్థ తో వ్యాపార సంబంధాలు నడిపిన ప్రతి ఒక్కరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాక.. ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న సమయానికి దాదాపు 2 గంటల ముందు ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంకా చనిపోయే ముందు సిద్దార్థ ఎవరెవరికి ఫోన్ చేసాడనే విషయంపై కూడా పోలీసులు ద్రుష్టి సారించారు. ఇక భారత కార్పొరేట్ రంగంలో కూడా సిద్ధార్థ పై పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు చెబుతుండడం విశేషం.