తెలంగాణలో విషాదం.. చెల్లి లేచిపోయిందని నలుగురు అక్కలు కలిసి

0
5622

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. తమ చెల్లి ఇల్లు వదిలి వెళ్లిపోయిందని.. దీనితో తమ పరువు పోయిందని భావించి మనస్తాపంతో నలుగురు అక్కలు కలసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. ఆ వివరాలలోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ కుటుంబంలో ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే.. ఇప్పటిదాకా వారిలో ఎవరికీ కూడా వివాహం కాలేదు. అయితే రెండు రోజులుగా ఇదో అమ్మాయి కనిపించకుండా పోయింది.

ఆ అమ్మయి గురించి ఆరా తీస్తే.. ఆ యువతి మరో అబ్బాయితో ప్రేమలో ఉందని, అతనితో కలసి వెళ్లిపోయిందని తెలిసింది. దీనితో తమకు పెళ్లి కాకుండా.. తమ చెల్లి ఇలా చేసినందుకు పరువు పోయిందని భావించిన నలుగురు అక్కలు కలసి.. చిన్న చెల్లిని, తల్లిని ఓ గదిలో బందించి.. నలుగురు అక్కలు పురుగుల మందు తాగారు. చిన్న చెల్లి, తల్లి పెద్ద పెద్దగా అరవడంతో.. స్థానికులు అక్కడకు చేరుకొని వారిని విడిపించి.. నలుగురు అమ్మాయిలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఇందులో ఓ యువతి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.