నిర్మాత బెల్లకొండ సురేష్ కి అరెస్ట్ వారెంట్.. అరెస్ట్ కి రంగం సిద్ధం

0
568

ప్రముఖ సినీ నిర్మాత బెల్లకొండ సురేష్ కి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. దీనితో అతడి అరెస్ట్ కి రంగం సిద్ధం అయింది. ఆ వివరాలలోకి వెళితే.. ఓ ప్రముఖ టీవీ చానల్ కి బెల్లకొండ సురేష్ మూడున్నర కోట్లు ఇవ్వలేదని ఆ టీవీ చానల్ ఆరోపించగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో ఆ ఛానల్ ఇచ్చిన మూడున్నర కోట్లుకు వడ్డీ కలిపితే.. ఇప్పుడు ఏకంగా పదకొండు కోట్లు దాటడం విశేషం. దాదాపు ఆరేళ్ల క్రితం హిందీలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ‘బాండ్‌ బాజా బరాత్‌’ సినిమా హిందీలో ఘన విజయం సాధించగా.. ఆ సమయంలోనే సమంత, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా బెల్లంకొండ సురేష్ ‘జబర్దస్త్’ అనే సినిమా తీశారు.

అయితే.. తమ సినిమాలోని పందొనిమిది సీన్లు కాపీ కొట్టారని సదరు యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనితో ‘జబర్దస్త్’ సినిమాని కోర్టు నిలిపివేసింది. అయితే అప్పటికే నిర్మాత బెల్లకొండ సురేష్ శాటిలైట్ హక్కులను మూడున్నర కోట్లకు ఆ సినిమా హక్కులను అమ్మేసుకున్నారు. అయితే సదరు టివి చానెల్ లోకూడా ఆ సినిమా ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో.. తిరిగి ఆ మొత్తాన్ని బెల్లకొండ సురేష్ ఆ ఛానల్ కి ఇవ్వాల్సి ఉంది. అయితే.. బెల్లకొండ సురేష్ ఆ మొత్తం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇప్పటికి ఆరేళ్ళు కావడంతో ఛానెల్‌ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన కోర్ట్ బెల్లంకొండ సురేష్ కి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.