Wednesday, September 22, 2021

సంచలన నిర్ణయం తీసుకోబోతున్న నిమ్మగడ్డ?

ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. స్థానిక నేత మధ్య మాటల యుద్ధం నుంచి.. అధికార విపక్ష నాయకుల విమర్శల దిశగా సాగి… మొదట హైకోర్టుకు.. ఆనక సుప్రీం కోర్టుకు చేరింది ఎన్నికల అంశం. ఇటు ప్రభుత్వం.. అటు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి మరింత ముదిరింది. చివరకు సుప్రీం కోర్టులో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ విజయం సాధించడంతో స్థానిక ఎన్నికలు నిర్వహించక తప్పడం లేదు ప్రభుత్వానికి.

అయితే నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, ఆ పార్టీ గెలుపు కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్న అధికార వైసీపీ ఏకగ్రీవాల బాట పట్టింది. స్థానికంగా ఇతర పార్టీలను నయానో.. భయానో నిలువరించి ఏకగ్రీవం చేసుకుంటూ ముందుకు పోతోంది. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా స్థానిక ఎన్నికల్లో ఇదే పందాను అనుసరిస్తాయి. గ్రామ స్థాయిలో అనధికార వేలం పాటలు నిర్వహించి ఎవరు ఎక్కువ మొత్తానికి పాడుకుంటారో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా చోట్ల జరుగుతుంది.

దీని ద్వారా ఇటు ఏకగ్రీవం అయిన అభ్యర్ధి ఇచ్చే మొత్తంతో పాటు, అటు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహక నగదు అందుతుంది. వీటిని తమ గ్రామం అభివృద్ధికి వినియోగిస్తుంటారు. కానీ ఈసారి జరుగుతున్న ఎన్నికలు అటు విపక్షాలకు, ఇటు అధికార పక్షానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడంతో పరిస్థితి మరింత జఠిలం అయింది. క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ ఏకగ్రీవాను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ దీన్ని అడ్డుకోవడానికి ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు ప్రక్రియను మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించే ప్రక్రియ కొలిక్కి వచ్చిందని సమాచారం. నిజంగా ఈ విధానం అమల్లోకి వస్తే విపక్షాల నెత్తిన నిమ్మగడ్డ పాలు పోసినట్లే. వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవాలు అయిన చోట విపక్షాల అభ్యర్థులు ఎవరో ఒకరితో ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేయించడం ద్వారా అధికార పక్షానికి షాక్‌ ఇవ్వడానికి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వేస్తున్న ఎత్తుగా దీన్ని భావించాలి. చూద్దాం ఎస్‌ఈసీ వర్సెస్‌ ప్రభుత్వంగా సాగుతున్న పోరులో విజయం ఎవర్ని వరిస్తుందో.

Latest Articles