ఎన్టీఆర్ మూవీ సంక్రాంతికి వద్దు అంటున్న అభిమానులు..అదే కారణం

0

ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రం సంక్రాంతి తర్వాత మొదటి షెడ్యూల్‌తో స్టార్ట్ కాబోతోంది. ప్రస్తుతం ‘వార్ 2’ షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్‌, ఆ సినిమా పూర్తి కాకుండానే డ్రాగన్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ షెడ్యూల్ కర్ణాటకలోని మంగళూరులో రెండు వారాల పాటు జరగనుంది. ఆ తర్వాత పలు విదేశీ లొకేషన్లలో షూటింగ్‌ను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9 లేదా 10వ తేదీన విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు పెద్ద ఎత్తున విడుదల కావడంతో థియేటర్లు షేర్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఓపెనింగ్స్‌ను ప్రభావితం చేయడంతో పాటు లాంగ్ రన్‌ వసూళ్లపైనా దెబ్బ పడే అవకాశం ఉంది. సోలో రిలీజ్ లేకుండా పండుగ సీజన్‌లో విడుదల చేస్తే రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం కష్టమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అభిమానుల అంచనా ప్రకారం, ‘డ్రాగన్’ అత్యధిక వసూళ్లు సాధించాలంటే పండుగ సీజన్‌ను తప్పించి ఒకే ఒక్కటిగా విడుదల కావాల్సి ఉంది. సినిమాకు సాలిడ్ హిట్ టాక్‌ వచ్చినా సోలో రిలీజ్‌ లేకపోతే వసూళ్లలో ఆశించిన స్థాయిని అందుకోవడం కష్టమే. అంతేకాక, ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మినిమం కలెక్షన్లు కూడా దక్కకపోవచ్చు.

ఈ నేపథ్యంలో సినిమాను 2026 సమ్మర్‌కి వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇటీవల చాలా పెద్ద సినిమాలు ప్రకటించిన తేదీలకు విడుదల కాకుండా కొంత ఆలస్యమవుతున్నాయి. దీని వల్ల సినిమాపై ఆసక్తి పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డ్రాగన్‌ వంటి భారీ చిత్రానికి సరైన తేదీ ప్లాన్‌ చేయడం అనేది అత్యవసరం. ముందస్తు ప్లానింగ్‌తో, రెండు వారాల ముందు లేదా తర్వాత మరే పెద్ద సినిమా విడుదల కాకుండా ఉండేలా చూసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ సినిమా విడుదల తేదీలను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయడంలో దిట్ట. ఎన్టీఆర్ కెరీర్‌లో మొదటి వెయ్యి కోట్ల వసూళ్ల సినిమా కావాల్సిన ‘డ్రాగన్’ విడుదల విషయంలో టీమ్‌ ఏ చిన్న పొరపాటు కూడా చేసే ఛాన్స్ లేదు . సోలో రిలీజ్‌ ప్లాన్ చేస్తే అభిమానుల అంచనాలకు తగిన విజయం సాధించడం ఖాయం.