మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన పేషంట్

0
3676

పాపం.. ఆ వ్యక్తికి 12 రోజుల నుండి నిద్ర పట్టడం లేదు. కంటి మీద కునుకు లేక పోవడంతో నరక యాతన అనుభవించాడు. అతడి బాధను చూసి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కానీ ఆసుపత్రిలో కూడా రెండు రోజుల నుండి నిద్ర లేదు. ఏమి చేయాలో అర్ధం కాలేదు. అంతే.. ఉన్న పళంగా మూడో అంతస్తు నుండి కిందకు దూకాడు. సంచలనం రేపిన ఈ ఘటన మధ్య ప్రదేశ్ కి చెందిన బేతుర్ లో జరిగింది. ఆ పేషేంట్ పేరు మదన్ సింగ్. కానీ అతడి అదృష్టం మాత్రం చాలా బాగుంది. మూడో అంతస్తు నుండి కిందకు దూకినా.. అతడు సేఫ్ గా ఉన్నాడు. ఎందుకంటే.. అతడి స్థితి చూసి ఆసుపత్రి సిబ్బంది వలతో కింద రెడీగా ఉన్నారు. అతడు మూడో అంతస్తు నుండి కిందకి దూకుతున్న విషయాన్నీ గమనించిన సిబ్బంది.. ముందుగానే అప్రమత్తం అయ్యారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీనితో అతడిని కాపాడ గలిగారు.