పవన్ కళ్యాణ్ కి అస్వస్థత.. అభిమానుల్లో ఆందోళన

0
918

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యము గురించి ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు తన ఆరోగ్యం బాగాలేదంటూ ఓ లేఖ విడుదల చేశారు. అందుకే మీడియా స్వేచ్ఛ కోసం విజయవాడలో నిర్వహిస్తున్న సమావేశానికి తాను హాజరు కాలేదని ఆ లేఖలో ప్రకటించారు. గతంలో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తనకు గాయాలు అయ్యాయని.. అప్పటి నుండి ఆ గాయం వెంటాడుతూనే ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆ నొప్పి గురించి పట్టించుకోక పోవడంతో.. ఇప్పుడు ఆ నొప్పి ఎక్కువ అయిందని తెలిపారు. దీనికి డాక్టర్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచనలు ఇచ్చారని తెలిపారు.

అయితే.. సంప్రదాయ వైద్య విధానాల పై నమ్మకంతో సర్జరీ చేయించుకోదలచుకోలేదని, కానీ ఇప్పుడు గాయం తిరగ బెట్టిందని చెప్పారు. అందుకే మీడియా స్వేచ్ఛ కోసం విజయవాడలో నిర్వహిస్తున్న సమావేశానికి తాను హాజరు కాలేదని ఆ లేఖలో ప్రకటించారు. మూడు రోజులుగా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవట్లేదని చెప్పారు. మీడియా స్వేచ్ఛ కోసం నా తరఫున, జనసైనికుల తరఫున పూర్తి మద్దత్తు ఇస్తామని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు.