‘జగన్ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది’

0
950

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రతి ఒక్కరికీ రాజధాని ఇచ్చుకుంటూ పోతే అది పాలన అనిపించుకోదని అన్నారు. రైతుల ఒంటి మీద పడ్డ దెబ్బ వైసిపి సర్వనాశనానికి దారితీస్తుందని అన్నారు. మాటలు రాని, బాధలు చెప్పుకోలేని, దెబ్బ కొడితే ‘అమ్మా’ అని అరవలేని ఒక మూగవాడిని పోలీసులు కొట్టారని అన్నారు. ఈ బాధ తాను ఎవరికీ చెప్పుకుంటాడని ప్రశ్నించారు. మిగిలిన వాళ్ళకి తగిలితే కనీసం చెప్పుకోగలరని.. కానీ కిరణ్ నాయక్ అనే రైతు చెప్పుకోలేని అన్నారు. కానీ ఈ భాద విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడని.. అదే వైసిపి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తుందని పవన్ శాపనార్ధాలు పెట్టారు. వైసిపి ప్రభుత్వవాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని అన్నారు.

మీకు అన్యాయం చేసిన ప్రతిఒక్కడు సర్వనాశనం చేసేవరకు భగవంతుడు ఉపేక్షించడని వరుసగా పవన్ శాపనార్ధాలు పెట్టారు. రైతుల భూములను అడ్డంగా దోచేసి, పనికి రాకుండా చేసి.. మిమ్మల్ని ఇలా కన్నీళ్లు పాలు చేసి, పోలీసుల చేత కొట్టించి, లాఠీ లు మీ ఒంటి మీద విరగనిచ్చేలా చేయడం క్షమించలేని నేరమని అన్నారు. కాకినాడలో కూడా ఇలానే కొట్టారని అన్నారు. పోలీసుల ముసుగులో వైసిపి వర్గాలు కూడా చేరిపోయానని అనుమానం వ్యక్తం చేశారు. సంఘ విద్రోహ శక్తులను ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని అన్నారు. రైతులు రాళ్లు వేయరని.. పోలీసులు రాళ్లు వేశారని అన్నారు. తాను ఒక్క మాట ఇస్తున్నానని.. అమరావతి ఇక్కడ నుండి కదలదని హామీ ఇచ్చారు.

తాను ఈ విషయమై మాట్లాడడానికి ఢిల్లీ వెళుతున్నానని చెప్పారు. బిజెపి కూడా అమరావతికి మద్దత్తు తెలిపిందని.. మోడీ గారు ఇక్కడ శంకుస్థాపన చేశారని అన్నారు. ఇలాగె ఉద్దానంలో ప్రజల కనీళ్లు చూసి తాను కరిగిపోయానని తానే చెప్పుకున్నారు. తన దగ్గర వేల కోట్లు లేవని.. మైనింగ్స్ లేవని, అందరూ సినిమాలు చూసి నాకు డబ్బులు ఇచ్చారని.. అవి తిరిగి ఇవ్వడానికి తాను రాజీకీయాలలోకి వచ్చానని అన్నారు. రాజకీయాలలో లభ్ది పొందాలని అనుకుంటే.. తాను ఎదో ఒక పదవి పొందే వాడినని అన్నారు. కానీ తాను అలాంటి వాడిని కాదని చెప్పుకున్నారు. ప్రజలకు కన్నీళ్లు వచ్చినప్పుడు జనసేన గుర్తుకు రావాలని కోరుకున్నారు. పెద్ద రాజకీయ నాయకులలాగా ప్రతి సారి హడావుడి చేయనని అన్నారు. తాను బిజెపికి ఒకటే చెప్పానని.. అమరావతిని శాస్వితంగా ఇక్కడే ఉంచుతానని చెబితేనే తాము కలుస్తామని చెప్పానని పవన్ అన్నారు.