పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండి ఆయన సినిమా షూటింగ్స్‌కి సరిగ్గా హాజరు. దర్శక, నిర్మాతలు పవన్ కోసం ఎదురుచూస్తూ విసిగిపోతున్నారనే వార్తలు మీడియాలో చాలా సార్లు హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా ‘ఓజీ’ మరియు ‘హరి హర వీర మలు’ వంటి సినిమాల షూటింగ్‌లో జాప్యానికి కారణం పవన్ కళ్యాణ్ అనే విమర్శలు కూడా ఎదురయ్యాయి.
ఎన్నికల సమయంలో రాజకీయ ప్రచారం, గెలిచిన తర్వాత పదవిలో బిజీగా ఉండటంతో సినిమాలు పట్టించుకోవడం లేదని, ఆయన వల్ల సినిమాల విడుదల ఆలస్యం అవుతున్నాయని అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా ఆయనపై ప్రశ్నలు సంధించారు. కానీ ఇటీవలి పరిణామాల తరువాత ఈ విమర్శలకు సరైన సమాధానం దొరికినట్లు అయ్యింది.
నిజానికి పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం డేట్లు ఇచ్చినప్పటికీ, ఆ సమయానికి దర్శక, నిర్మాతలు ఆయన్ని సరిగా వాడుకోలేకపోయారని సమాచారం. పవన్ వర్గాల నుంచి వచ్చిన వివరణ ప్రకారం, ఆయనకు కేటాయించిన డేట్లలో చిత్ర యూనిట్లు పూర్తిగా సిద్ధంగా లేకపోవడం వల్లే చిత్రీకరణలు పూర్తవ్వలేదట. ‘ఓజీ’ మరియు ‘హరి హర వీర మలు’ చిత్రాలకు డేట్లు ఇచ్చినప్పటికీ, యూనిట్లు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేయలేకపోయాయి.
అదే విధంగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమా కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొందట. పవన్ తన సమయాన్ని ఇచ్చినప్పటికీ, ప్రాజెక్ట్ అనుకున్న రీతిలో ముందుకు సాగకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది తెలుస్తొంది.ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు మరియు దర్శకులు ఆయన డేట్లను సద్వినియోగం చేసుకోవాలని, ఇతర కారణాలతో ఆలస్యం జరగకుండా చూసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక దీంతో ఆయన పై వచ్చిన “డేట్లు ఇవ్వరు” అనే అపవాదు తొలగిపోయిందని తాజా వివరణతో స్పష్టమైంది.
ఇకపై పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయాలనుకునే దర్శక, నిర్మాతలు ఆయన డేట్లను కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని, సమర్థంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది నిర్మాతలే అనుసరించవలసిన విషయమని స్పష్టమైంది.