చేతిమీద ఉన్న గీతలు అరగదీస్తాం: పవన్ కళ్యాణ్ వార్నింగ్

0

చాలా రోజుల తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన తరువాత సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని వారు.. మళ్లీ వస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం సరికాదని అన్నారు.

తమపై జీతాలు దాటి మాట్లాడితే చేతిమీద ఉన్న గీతలు అరగదీస్తామని హెచ్చరించారు. రౌడీయిజం చేసేవాళ్ల కీళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పవన్ కళ్యాణే అని హెచ్చరికలు చేశారు. విదేశాల్లో కూర్చుని సోషల్ మీడియాలో అసత్యాలు మాట్లాడేవారిని ఊరుకునేది లేదని అన్నారు.

ఆకు రౌడీలకు భయపడేది లేదని.. అలాంటి వారికి యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలని అన్నారు. కాలుకి కాలు, కీలుకి కీలు తీసి మడతపెట్టి కూర్చోపెడితే తిక్క కుదిరిద్దని తీవ్ర హెచ్చరికలు చేశారు. పాత పద్ధతిలోనే మేముంటామని వైసీపీ నేతలు అంటే.. తాను విసిగిపోయానని అన్నారు. కులాల సమూహం అని కొట్టుకుంటున్నారని.. దేశం కోసం కలసి మాట్లాడడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.