పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ మూవీ అంటే చాలు విడుదలకు ముందు నుంచే ఆ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఉన్న హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు ఎప్పుడు పూర్తవుతాయా అని అతని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలకు సంబంధించి ఏ చిన్న లీక్ వచ్చినా వైరల్ అయిపోతుంది.
తాజాగా ఫిలిం సర్కిల్లో పవన్ ఓజీ మూవీకి సంబంధించి ఓ గాసిప్ హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ విషయంలో వినిపిస్తున్న న్యూస్ పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాన్ని సృష్టించేలా ఉంది. చాలా రోజుల తర్వాత పవన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఓ జి. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ ఫైట్స్ చేస్తారో చూడాలి అని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ మూవీలో పవన్ ఓ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్దికాలంగా రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ త్వరలో తిరిగి ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి ఓ వార్త హాల్చల్ చేస్తోంది. ఇందులో ఓ గెస్ట్ రోల్ లో ప్రభాస్ చేయబోతున్నారు అనే ఈ వార్త ఇటు మెగా అభిమానులనే కాకుండా అటు డార్లింగ్ ఫాన్స్ ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ప్రభాస్ సాహో మూవీ చేసిన సుజిత్ ఇప్పుడు ఓజీ మూవీ ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. పైగా సాహో కి నార్త్ లో మాంచి క్రేజ్ వచ్చింది కాబట్టి.. ప్రభాస్ ఇమేజ్ ని వాడుకొని ఓజీని నార్త్ లో కూడా ఓ రేంజ్ లో తీసుకు వెళ్ళడానికి సుజిత్ ఈ ప్లాన్ వేసినట్లు టాక్. మరోపక్క ఈ మూవీ తో పవన్ వారసుడిగా అకిరా నందన్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న ప్రచారం గట్టిగానే సాగుతోంది.
దీనికి తోడు ఇప్పుడు తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయి చిత్రంలో గెస్ట్ రోల్ చేయబోతున్నారు అంటూ వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అందరి మైండ్స్ బ్లాక్ చేస్తోంది. పవన్ కు చరణ్ తో ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ బాగా తెలుసు. ఇప్పటికే రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అయితే బాబాయితో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న మెగా అభిమానులు ఈ న్యూస్ తో ఫుల్ కుష్ అవుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.