పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానులకు అభిమాన దేవుడు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. వీటిలో ‘అత్తారింటికి దారేది’ సినిమా ఒకటి. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. టీవీల్లో ఎన్ని సార్లు చూసినా ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. ఇది ఎంతటి పెద్ద హిట్ అయ్యిందో, ఎలా రికార్డులు సృష్టించిందో మనకు తెలుసు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ముందుగానే హెచ్డీ ప్రింట్ లీక్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. రిలీజ్ అయ్యిన ఆరు రోజుల్లోనే రూ. 75 కోట్ల వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది అప్పట్లో సాధారణ విషయం కాదు. ఈ సినిమా సక్సెస్ చూసిన తరువాత, ఎంత మంది స్టార్ హీరోలు వచ్చినా, ‘అత్తారింటికి దారేది’ సినిమా రికార్డులు బద్దలు కాలేదంటే ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలా ఉందో చెప్పక్కర్లేదు.
ఈ సినిమాను మొదట మహేష్ బాబు కోసం రాసిన కథ అని సమాచారం. కానీ చివరికి పవన్ కళ్యాణ్ నటించారు. ఆయన నటన, త్రివిక్రమ్ కథన శైలి ఈ సినిమాను భారీ విజయవంతం చేశాయి. రాజమౌళి ‘బాహుబలి’ వరకు థియేటర్లలో బలంగా నిలిచిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఇదివరకు ఎవ్వరికీ తెలియని ఒక విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో కూడా కనిపించారని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. అవును, క్లైమాక్స్ సీన్లో ఒక షాడో కనిపిస్తుంది. అది మరెవరిదో కాదు, రామ్ చరణ్దని త్రివిక్రమ్ చెప్పారు. షూటింగ్ చూడటానికి రామ్ చరణ్ సెట్‌కు వచ్చి, ఫోన్ మాట్లాడుతుండగా అనుకోకుండా ఆ సీన్లో కనిపించారట. ఈ విషయం ఇన్నాళ్లకు బయట పడటంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి పూర్తిస్థాయి స్క్రీన్ స్పేస్ పంచుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు. తరువాత ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి. కానీ ‘అత్తారింటికి దారేది’ సినిమా ద్వారా మెగా ఫ్యాన్స్‌కు ఇప్పటికీ ఎంతో గుర్తుండిపోయే సంతోషం కలిగించింది.