పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన ప్రతిసారి అతని అభిమానుల మదిలో మెదిలే మరొక పేరు రేణు దేశాయ్. ఆమె అతని భార్యగానే కాకుండా ఆ తరువాత జరిగిన ఎన్నో కాంట్రవర్సీలకు కారకురాలిగా అందరికీ సుపరిచితురాలు. తన మనసుకు నచ్చినట్టు ముక్కుసూటిగా మాట్లాడే రేణూ మరొకసారి నెటిజన్లకు ఓ సూచన అందించారు. ప్రస్తుతం ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అయింది. మళ్లీ తిరిగి దీనిపై నెగటివ్ కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెడతారు అనుకుందో ఏమో కానీ కామెంట్ సెక్షన్ కూడా క్లోజ్ చేసింది.
ఇంతకీ ఆ పోస్ట్ దేని గురించో తెలుసా? రీసెంట్గా రేణూ దేశాయ్ తల్లి మరణించారు.. ఈ సందర్భంలో ఆమెకు సంతాపం తెలియజేస్తూ నెటిజన్ల చాలామంది రెస్ట్ ఇన్ పీస్, రిప్ అంటూ మెసేజ్లు పెట్టారు. ప్రస్తుతం చాలామంది చనిపోయిన వారి గురించి ప్రస్తావించినప్పుడు ఇలాంటి పదాలు వాడుతున్నారు. అయితే వీటిపై స్పందించిన రేణు దేశాయ్ ఇది మన సంస్కృతి కాదు అంటూ నేటిజనులకు ఓ భారీ క్లాస్ తీసుకున్నారు.
సనాతన ధర్మం ప్రకారం.. ఆత్మ అనే దానికి హిందూ ధర్మంలో ఎప్పుడూ ఒంటరితనం లేదు అని పేర్కొన్న రేణూ దేశాయ్.. మన సంస్కృతి ప్రకారం ఎవరైనా మరణించారు అని తెలిస్తే ఓం శాంతి, సద్గతి అనే పదాలు ఉపయోగించాలి కానీ ఇలా రెస్ట్ ఇన్ పీస్, రిప్ అనే ఇంగ్లీషు పదాలు మనకు వర్తించవు అని పేర్కొన్నారు. అంతేకాదు హిందూ ధర్మం ప్రకారం ఆత్మకు నాశనం లేదని.. పుట్టడం గిట్టడం అనేది నిరంతరం జరిగే ఒక సర్కిల్ లాంటివని పేర్కొన్నారు.
“మంగళవారం నాడు మా తల్లి మరణించిన తర్వాత నా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎందరో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి , రిప్ (RIP) అంటూ సందేశాలు పంపి తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే సనాతన ధర్మం గురించి తెలిసిన ఓ పండితుడి దగ్గర నేను ఈ రెండు పదాల (RIP, సద్గతి )మధ్య ఉన్న తేడా అడిగి తెలుసుకున్నాను. అందుకే ఈ విషయాన్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో పంచుకోవాలి అని భావిస్తున్నాను. అంతేకానీ నేను ఎవరి నమ్మకాలను ప్రశ్నించడం లేదు.. నా ఉద్దేశం అందరికీ స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నాను.” అని రేణూ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు.