పుష్ప 1 మూవీలో సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఈ చిత్రంలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఊపేసిందో రష్మిక చేసిన నా సామి పాట అంతకంటే ఎక్కువగా మైమరిపించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా త్వరలో విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీ నుంచి విడుదలైన అన్ని సాంగ్స్ విపరీతమైన ఆదరణ అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘పీలింగ్స్’ అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇక బన్నీ డాన్స్ తో పాటు రష్మిక ఎక్స్ప్రెషన్స్ ఈ పాటకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సూపర్ బీట్తో బన్నీ ఫాన్స్ ఆశిస్తున్న కిక్ అందివ్వడంలో దేవిశ్రీప్రసాద్ ఈ పాటలో ఫుల్ సక్సెస్ సాధించాడు. సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇందులో రష్మిక పర్ఫామెన్స్ మరో ఎత్తు అన్నట్టుగా ఉంది పరిస్థితి.
బన్నీ ఎంత భీభత్సమైన డాన్సరో అందరికీ తెలుసు.. మరి అతని ఎనర్జీ ని మ్యాచ్ చేస్తూ రష్మిక ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. అసలు ఈ సాంగ్ చూసినంత సేపు చాలా వరకు ఆడియన్స్ బన్నీని పక్కన పెట్టి రష్మికను గమనిస్తారు. అనడంలో ఆశ్చర్యం లేదు. మంచి ఫాస్ట్ మాస్ బీట్ సాంగ్ కి అంతకంటే మాస్ స్టెప్స్ ని ఫుల్ ఎనర్జీతో రఫ్ ఆడించేసింది.
ఒకవైపు నాట్ స్టెప్పులతో అదరగొడుతూ మరోవైపు తన అందంతో ఆడియన్స్ ని కట్టిపడేసేలా ఉంది రష్మిక. దీంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ‘రష్మిక మందన’ హ్యాష్ ట్యాగ్ తో ఫుల్లు వైరల్ అవుతుంది. ఇక రష్మిక పర్ఫార్మ్ చేసే ఈ పీలింగ్స్ సాంగ్ కు థియేటర్లో ఆడియన్స్ ఫీలింగ్స్ పిక్ కి వెళ్లడం కన్ఫామ్. మరో రెండు రోజుల్లో విడుదల ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పాట చిత్రంపై అంచనాలను మరింత పెంచేస్తోంది.