
ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘రాజా సాబ్’ సినిమాతో ఈ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, మరోవైపు హను రాఘవపూడితో ‘ఫౌజీ’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఇందులో తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అటు సందీప్ రెడ్డి వంగా స్టైల్, ఇటు ప్రభాస్ మాస్ అప్పీల్ కలిస్తే, సినిమా ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. కథ మొత్తం డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో నడవనుండగా, కథానాయకుడు, విలన్ మధ్య ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ముఖ్యంగా ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే జకార్తాలో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, థాయిలాండ్‌లో అరుదైన లొకేషన్లలో షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌పై సందీప్ వంగా పూర్తి ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని, త్వరలో షూటింగ్ షెడ్యూల్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ చివరి పనులను పూర్తి చేసుకుని, ‘ఫౌజీ’ షూటింగ్ 50%కి పైగా ముగించాకే ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్లనున్నారని సమాచారం. అనుకున్నట్లు జరిగితే మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఓ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించనుండటంతో, అభిమానులకు ఇది పెద్ద ట్రీట్ కానుంది. పోలీస్ పాత్రలో ఆయన అగ్రెసివ్ షేడ్స్ చూపిస్తారని, యాక్షన్ సీన్స్ హై స్టాండర్డ్స్‌లో ఉండబోతున్నాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇతర ముఖ్యమైన నటీనటుల ఎంపిక దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ముఖ్యంగా విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి ఎవరో ప్రముఖ నటుడిని తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, కొరియన్ నటుడు డాన్ లీ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.
నేపథ్య సంగీతానికి హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంచుకున్నారు. ఆయన ఇప్పటికే వర్క్ ప్రారంభించారట. సందీప్ వంగా సినిమాల్లో బీజీఎమ్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. షూటింగ్ సమయంలోనే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ప్లే చేస్తూ సన్నివేశాలకు మరింత ఇంపాక్ట్ తీసుకురావడంలో వంగా ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
ఈ భారీ చిత్రాన్ని సందీప్ వంగా తన భద్రకాళి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, టీ-సిరీస్‌తో కలిసి నిర్మించనున్నారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026 ప్రారంభంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.