మారుతి, తన ప్రత్యేకమైన కథా దృష్టితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకుడు. ఇటీవల గోపీచంద్‌తో చేసిన పక్కా కమర్షియల్ తర్వాత ఆయనకి రెబల్ స్టార్ ప్రభాస్‌తో పని చేసే అవకాశమొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం మారుతి తన దగ్గర ఉన్న ఐడియాను సరికొత్త కథగా మార్చి యువి క్రియేషన్స్ టీంకి చెప్పాడు. వాళ్లు ఈ కథకు సపోర్ట్ చేయగా, ప్రభాస్ కూడా ఇందులో నటించేందుకు ఒప్పుకున్నాడు.
మొదట ఈ సినిమా యువి బ్యానర్‌లోనే చేయాలని భావించినా, ఆదిపురుష్ వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లింది. ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానుల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ, ప్రభాస్ కథపై నమ్మకంతో ముందుకు వెళ్లాడు.
‘రాజా సాబ్’ మోషన్ పోస్టర్ విడుదలైన దగ్గర నుంచి సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని దర్శకుడు మారుతి లక్ష్యంగా పెట్టుకున్నాడు. మారుతి పేరు చెప్పగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లు గుర్తొస్తాయి. అయితే తన రొటీన్ స్టైల్ కి భిన్నంగా ప్రభాస్‌తో కొత్త తరహా సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నాడు.
ఫ్యాన్స్ మొదటగా మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌పై కొంచెం డౌటుగా ఉన్నా, కథపై నమ్మకం పెరగడంతో వాళ్లలో ఆసక్తి కూడా పెరిగింది. ఈ మూవీ సక్సెస్ సాధిస్తే మారుతి పేరు పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం ఉంది.
ఇక ఈ మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఆలోచించలేదు. అయితే, ఆయన చాలా కాలంగా అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్‌తో పని చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ తర్వాత మారుతితో సినిమా ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది.‘రాజా సాబ్’ విజయం సాధిస్తే, మారుతి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోలతో పని చేసే అవకాశాలు పెరుగుతాయి. మరి, ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌కు కొత్త విజయం తీసుకురావడంతో పాటు, మారుతిని మరో లెవెల్‌కు తీసుకెళుతుందేమో చూడాలి.