టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. అయితే ప్రభాస్ కి బాహుబలి చిత్రం తర్వాత వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న కల్కి 2898 ఏడీ మూవీ తెలుగు ప్రేక్షకుల తో పాటు వరల్డ్ వైడ్ అందరినీ అలరించింది. ఇక ఇప్పుడు జపాన్ లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
2025 జనవరి 3న కల్కి చిత్రం జపాన్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. బాహుబలి మూవీ సక్సెస్ తర్వాత ప్రభాస్కు జపాన్ లో అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి సినిమాలకు కూడా జపాన్ లో మంచి క్రేజ్ ఉంది.. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్లో భారీ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో జపాన్లో విడుదల కాబోతున్న కల్కి చిత్రం పై సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.
ఇక కల్కి 2898 ఏడీ చిత్రం జపాన్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం జపాన్ కు వెళ్లడం జరిగింది. ఇందులో పాల్గొనాల్సిన ప్రభాస్ కాలికి గాయం కారణంగా జపాన్ కు వెళ్లలేకపోయారు. ఇదే విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన ప్రభాస్ కల్కి ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోతున్నందుకు క్షమించవలసిందిగా జపాన్ అభిమానులను కోరుతూ ఓ వీడియో అని విడుదల చేశారు.
ఈ వీడియోలో ప్రభాస్ కొన్ని జపనీస్ పదాలను కూడా ఉపయోగించి అందరిని ఆశ్చర్యపరిచారు. జపాన్ భాషలో అక్కడివారికి నమస్కారం చేస్తూ వారిని మరింత ఆకట్టుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా కాలంగా జపాన్ కి రావాలి అని అనుకుంటున్నాప్పటికీ ఏదో ఒక కారణం వల్ల తన ప్రయాణం వాయిదా పడుతూ వస్తుందని.. ఈసారి కాలికి అయిన గాయం కారణంగా రాలేకపోతున్నానని ప్రభాస్ ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాదు జపాన్ లో ఉన్నత నా అభిమానులు కల్కి 2898 ఏడీ చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకున్నారు.