ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఎవరికీ అంచనాలు లేకుండానే బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి, ఇండస్ట్రీ మొత్తానికి ఔరా అనిపించింది. సాధారణంగా చిన్న సినిమాగా భావించిన ఈ చిత్రం, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా, స్టార్ హీరోల చిత్రాలను బీట్ చేస్తూ సంక్రాంతి రేసులో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో తేజ సజ్జ పాన్ ఇండియన్ హీరోగా మారిపోగా, అమృత అయ్యర్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది.
ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కంటెంట్ ను పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన ఆయన, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. కానీ, ఇప్పుడు ప్రశాంత్ వర్మ, అమృత అయ్యర్ మధ్య వివాదం ఉండవచ్చని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమృత అయ్యర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఆమె చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు, ప్రశాంత్ వర్మతో ఆమెకు ఏదైనా గొడవ జరిగిందేమో అని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, ‘హనుమాన్’ ప్రమోషన్లలో అమృత పెద్దగా పాల్గొనకపోవడం, తరువాత ఆమె మాట్లాడుతూ ‘షూటింగ్ బిజీగా ఉన్నందున పాల్గొనలేకపోయాను’ అని చెప్పడం నెటిజన్లను ఆసక్తికి గురి చేసింది.
తాజాగా అమృత నటించిన మరో చిత్రం ‘బచ్చలమల్లి’ ప్రమోషన్ల సమయంలో, ఆమె హనుమాన్ గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. దీనిపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత, రాబోయే ‘జై హనుమాన్’ సినిమాలో అమృత ఉంటుంది లేదా కొత్త హీరోయిన్‌ను తీసుకుంటారా అనే విషయంపై ఆసక్తి పెరిగింది.
హనుమాన్ సినిమా ద్వారా అమృతకు పాన్ ఇండియా స్థాయి గుర్తింపును తీసుకువచ్చిన ప్రశాంత్ వర్మ, ఆమెను మళ్లీ జై హనుమాన్ చిత్రంలో కాస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇంతకీ అసలు ఇద్దరి మధ్య వివాదం ఉందా లేదా అనే విషయం పై కూడా స్పష్టత లేదు.ఈ వివాదంపై ఇద్దరి నుంచి క్లారిటీ రాకపోయినా, సోషల్ మీడియాలో ఈ చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.