సినీ ఇండస్ట్రీ విస్తరిస్తున్న కొద్ది 1000 కోట్ల రీచ్ అనేది ప్రతి సినిమాకి ఓ టార్గెట్ గా మారుతోంది. పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు అంటే మేకర్స్ మొదటి ఎక్స్పెక్టేషన్ ఇదే అవుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు బాక్స్ ఆఫీస్ వద్ద బాలీవుడ్ సినిమాల హవా కొనసాగింది. అయితే ఈ రికార్డులను తిరగరాస్తు రాజమౌళి బాహుబలి మొదటిసారి తెలుగు వాడి సత్తా ఇంటర్నేషనల్ మార్కెట్ కు చాటి చెప్పింది.
కొన్నేళ్ల క్రితం వరకు అసలు టాలీవుడ్ సినిమాలు వైపు కూడా చూడని వారు ఈరోజు తెలుగు సినిమా అంటే చాలు విపరీతమైన క్రేజ్ కనబరుస్తున్నారు. బాహుబలి 2 ,ఆర్ఆర్ఆర్, KGF 2 వంటి సౌత్ సినిమాలు ఈ 1000 కోట్ల మార్క్‌ను అధిగమించడమే కాదు, కొత్త రికార్డులను సృష్టించాయి. అయితే తాజాగా విడుదలైన అల్లు అర్జున్ పుష్ప చిత్రం విడుదలైన ఆరు రోజుల లోపే 1000 కోట్ల క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
పుష్ప 2 మూవీ సునామీ లా ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు అంతర్జాతీయ బాక్సాఫీస్ ను కూడా చెడుగుడు ఆడేస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత త భారీ వసూలు సాధించిన బ్లాక్ బస్టర్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. బాహుబలి 2 విడుదలైన పది రోజులలో 1000 కోట్ల మార్కును దాటితే.. పుష్ప 2 చిత్రం ఆరు రోజులకే ఆ ఘనత సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది.
1000 కోట్ల క్లబ్ చేరుకున్న చిత్రాలలో పుష్ప, బాహుబలి 2 16 రోజులలో ఈ రికార్డు సాధించి ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 తర్వాత స్థానాలలో ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ విడుదలైన 27 రోజులలో 1000 కోట్ల క్లబ్ కి చేరుకున్న షారుక్ పఠాన్ సొంతం చేసుకుంది. తాజాగా పుష్ప సాధించిన రికార్డు తర్వాత సౌత్ నుంచి 1000 కోట్ల క్లబ్ వైపుకు దూసుకు వెళ్లే సినిమాల సంఖ్య పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆరు రోజులకే ఎన్ని రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ముందు ముందు మరిన్ని రికార్డులు సాదిస్తుందో చూడాలి.