భారీ అంచనాల మధ్య లేటెస్ట్ గా థియేటర్లలో విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే అనూహ్యంగా ఈ చిత్రానికి తెలుగింటి ఆదరింపు తక్కువగా ఉన్నప్పటికీ నార్త్ సైడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన మూడు రోజులకే 500 కోట్ల క్లబ్ లో చేరిపోయిన ఈ సినిమా సినీ వర్గాలలో పెద్ద టాక్ గా మారింది. నార్త్ ఏరియాలో ప్రస్తుతం పుష్పరాజ్ దున్నేస్తున్నాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు.
సాధారణంగా నార్త్ ఆడియన్స్లో డబ్బింగ్ చిత్రాలకు ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది.. కానీ ఆ రికార్డులను చెరిపి వేస్తూ పాన్ ఇండియా రేంజ్ లో బీభత్సాన్ని సృష్టిస్తోంది పుష్ప.తెలుగులో మాత్రం పుష్ప 1 మూవీ తో పోలిస్తే సెకండ్ పార్ట్ అంత కిక్ లేదు అంటున్నారు అభిమానులు.తెలుగు వాళ్లకు పెద్దగా రుచించకపోయినా నార్త్ ఆడియన్స్ను అంతగా ఈ చిత్రం మెస్మరైజ్ చేయడానికి ముఖ్య కారణాలు ఏమిటో తెలుసుకుందాం..
ఈ చిత్రంలో ఊర మాస్ సెటప్ తో.. అసలు ఎవరినీ లెక్క చేయని ఓ అరగంట నేచర్ తో ఉన్న పుష్పరాజ్ మేనరిజం నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. పైగా పుష్ప మూవీ చిత్రీకరణ వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ఉండడంతో ఈ చిత్రాన్ని వాళ్ళు బాగా ఆదరించారు. ఈ చిత్రంలో ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ కూడా నార్త్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయి. ఇక ఇందులో గంగమ్మ జాతర, శ్రీ లీల స్పెషల్ సాంగ్, రష్మిక అదరగొట్టే నటన కూడా వాళ్లకి బాగా నచ్చుతున్నాయి.
ఇక మూవీకి దేవిశ్రీప్రసాద్ పాటలు, సిచువేషన్ కి తగ్గట్టుగా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అల్లు అర్జున్ నటన, అతని మాస్ లుక్, ఇప్పటివరకు ఎవరు చూడని డిఫరెంట్ మేనరిజ.. నార్త్ ఆడియన్స్ ని అతనికి బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. దీంతో పుష్ప తో పాటు అల్లు అర్జున్ రాబోయే చిత్రాలకు కూడా నార్త్లో భారీ మార్కెట్ ఉంటుంది అంటున్నారు ట్రేడ్ పండితులు.