ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన కాంబోలో సుకుమార్ తెరకెక్కించిన మాస్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. ఈ మూవీ భారీ ఆదరణ అందుకోవడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 చిత్రం అంతకంత రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 9 రోజులలోనే 12 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ వీకెండ్ ఈ మూవీకి కలెక్షన్స్ మరికాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది.
త్వరలో ఈ చిత్రం 2,000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అందరూ భావిస్తున్నారు.ఇంతలో సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనలో మృతిచెందిన మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. ఇందులో భాగంగా నిన్న పోలీసులు అల్లు అర్జున్ ని అతన్ని నివాసం వద్ద అరెస్టు చేశారు. హైకోర్టు విచారణ అనంతరం అతనికి బెయిల్ కూడా మంజూరు అయింది. ఈరోజు జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి కూడా చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ మూవీ కలెక్షన్స్ పై ఎలా ఉంటుంది అన్న గుసగుసలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అల్లు అర్జున్ హైకోర్టులో వేసిన పిటీషన్ విచారణ అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
13 గంటల పాటు సాగిన ఈ హైడ్రామాకు తెరదించుతూ ఎట్టకేలకు ఈరోజు ఉదయం ఆయన్ని అధికారులు జైలు నుంచి విడుదల చేశారు. ఒకరకంగా అల్లు అర్జున్ అరెస్ట్ అతని అభిమానులకు చాలా పెద్ద షాక్ అని చెప్పవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 11 వేల స్క్రీన్ లతో డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా 1000 కోట్లు కలెక్ట్ చేసింది. 9వ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది.. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడమే దీనికి ముఖ్య కారణం అని టాక్. ఎందుకంటే తమ హీరో అరెస్ట్ అయ్యాడని తెలుసుకున్న అభిమానులు భారీగా జైలు వద్ద చేరుకోవడంతో.. శుక్రవారం మధ్యాహ్నం వరకు బుకింగ్ సంతం మాత్రం గానే ఉన్నాయి. అయితే అనంతరం ఫస్ట్ షో, సెకండ్ షోలకు మాత్రం సాలిడ్ టికెట్స్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. 9వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 42 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని టాక్. ఇక ఈ వీకెండ్ ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.