భారీ అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఇప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోతోంది. మొదటి రోజు వసూళ్ల దగ్గర నుంచి ఇప్పటివరకు ఈ మూవీ అత్యధిక వసూలను తన ఖాతాలో వేసుకుంటుంది. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఈమె అవి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఇటు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కూడా పుష్ప తన సత్తాను చాటుతోంది. ఈ నేపథ్యంలో మొదటి పది రోజుల వసూళ్లను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.
మైత్రి మూవీస్ వారి అధికారిక ప్రకటన ప్రకారం పుష్ప 2 మూవీ మొదటి 10 రోజుల్లో రూ.1292 కోట్ల వసూలు చేసింది అని తెలుస్తోంది.2024 లో విడుదలైన సినిమాలన్నిటిలోకి మొదటి పది రోజుల అత్యధిక వసూలు సాధించిన మూవీ పుష్ప అని తేలిపోయింది. ఈ మూవీ నార్త్ జోరు కారణంగానే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి.
2021 లో విడుదలైన పుష్ప 1 మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మొదటి నుంచి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై అంచనాలు ఆరెంజ్ లో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏ మూవీ విడుదల కోసం ఉత్తర భారతదేశం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ మూవీ ఇండియన్ సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ.1000 కోట్లకు పైగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ కలెక్షన్స్ చూసి బాలీవుడ్ వర్గాల సైతం షాక్ అయ్యాయి.
ఏ స్థాయి లో ప్రీ రిలీజ్ కలెక్షన్స్ వచ్చాయో అదే స్థాయి లో
సినిమా వసూళ్లు నమోదు కావడం తో ఈ మూవీ ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డ్స్ బదలు కొట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం బాహుబలి 2 రూ.1800 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుని ఫస్ట్ ప్లేస్ లో ఉంది..అయితే పుష్ప 2 మరో 500 కోట్లు వసూళ్లు సాధించ గలిగితే బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.