ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘‘పుష్ప 2’’ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. 1600 కోట్ల గ్రాస్ వైపు వేగంగా పరిగెడుతున్న ఈ సినిమా హిందీలోనే 650 కోట్ల కలెక్షన్లను రాబట్టడం విశేషం. ప్రేక్షకుకు ఈ సినిమా పై కాసుల వర్షం కురిపించడం చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ సినిమా సక్సెస్ పట్ల ఆశ్చర్యపోతున్నారు. ‘‘బాహుబలి 2’’ , ‘‘దంగల్’’ వంటి చిత్రాలతో పోటీ పడతున్న ‘‘పుష్ప 2’’ .. జపాన్, చైనాల్లో విడుదల అయితే దంగల్ రికార్డులను సైతం దాటుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే, ఈ ఘనవిజయం మధ్యలో పైరసీ రూపంలో మరో సమస్య ఎదురవుతోంది. ‘‘పుష్ప 2’’ HD ప్రింట్ టెలిగ్రామ్ యాప్ మరియు ఆన్లైన్ లో లీకైనట్లు సమాచారం. థియేటర్ ప్రింట్ లీక్ ఎక్కువ ప్రభావం చూపించకపోయినా, HD ప్రింట్ డౌన్లోడ్స్ వసూళ్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పైరసీ వల్ల ఇప్పటికే థియేటర్లలో జోరుగా కొనసాగుతున్న వసూళ్లు పాక్షికంగా తగ్గవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మూవీ విడుదలై ఇంకా 16 రోజులు మాత్రమే అవుతుండగా, ఈ లీక్ నిర్మాతలలో కలవరం క్రియేట్ చేస్తోంది. దీనిపై మేకర్స్ తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. పైరసీ మూలాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటపడతాయని భావిస్తున్నారు.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రాలకు పైరసీ ప్రధాన సమస్యగా మారింది. ‘‘పుష్ప 2’’ విజయం ఈ సమస్యను అధిగమిస్తే, తదుపరి భాగం ‘‘పుష్ప 3’’ మరింత ఊపందుకోవడం ఖాయం. ఇండస్ట్రీ లో ఈ సమస్యకు పరిష్కారం అవసరమని పలువురు అంటున్నారు. విడుదలైనప్పటి నుంచి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుష్ప 2 చిత్రం ఈ సమస్యను ఎలా దాటుతుందో చూడాలి.