భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న పుష్ప 2 వరల్డ్ వైడ్ గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రమోషన్స్ లో భాగంగా యమ బిజీగా తిరుగుతున్నారు. అసలు తీరిక లేకుండా పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబై ఇలా ఓవరాల్ ఇండియా కవర్ చేస్తున్నాడు. ఇక వెళ్ళిన ప్రతి దగ్గర పుష్పరాజ్ కు భారీ ఎత్తున అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. పుష్ప విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల గురించి గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2 టార్గెట్ ఇది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక నెల రోజుల నుంచి పుష్ప 2 సుమారు 1000 కోట్ల బిజినెస్ చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. మరో పక్క పీఆర్ టీం నుంచి కూడా చిత్రానికి సంబంధించి లీకులు వస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన అన్ స్టాపబుల్ టాక్ షోలో కూడా బాలయ్య ఇదే విషయం గురించి అడిగారు.
అయితే 1000 కోట్లు అన్న విషయాన్ని బన్నీ కమిట్ కాలేదు.. ఇన్ డైరెక్ట్ గా ఇంతవరకు తెలుగు సినిమాలలో హైయెస్ట్ ఇదే అని మాత్రం అన్నాడు. మరోపక్క నిర్మాణ సంస్థ మైత్రి కూడా 1000 కోట్ల మాట ఎత్తకుండా దాటేశారు. చిత్రానికి సంబంధించిన నాన్ థియరీటికల్ రైట్స్ నుంచి 400 కోట్ల వరకు వచ్చిందని టాక్. ఇక థియేట్రికల్‌గా ఎంత రన్ అవుతుంది అని లెక్కలు తేలాల్సి ఉంది.. బిజినెస్ ఎంత జరుగుతుంది, ఆక్యుపెన్సి ఎలా ఉంటుంది.. లాంటి వివరాలను బట్టి చివరిలో లాభ నష్టాలు లెక్కలు వేసుకోవాలి.
ఇప్పటివరకు తెలుగులో ఈ చిత్రానికి 215 కోట్ల టార్గెట్ ఉందని తెలుస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం సుమారు 20015 కోట్ల షేర్స్ రాబట్టాల్సి ఉంటుంది. అలా జరిగితేనే బ్రేక్ ఈవెన్ అచీవ్ అయినట్టు లెక్క. అన్ని బాగా జరిగి, పాజిటివ్ రివ్యూస్ వచ్చి, మౌత్ పబ్లిసిటీ కూడా ప్లస్ అయితే ఆర్ఆర్ఆర్, బాహుబలి టైప్ లో పుష్ప 2 400 నుంచి 500 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం కూడా ఉంది. మరి ఆ రేంజ్ టార్గెట్ సాధించడం పుష్ప 2 కు కుదురుతుందా లేదా అన్న విషయం కలెక్షన్స్ పై ఆధారపడి ఉంది.