ఈ ఏడాది రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో అత్యధిక వసూలు సాధించి వరల్డ్ వైడ్ పాపులారిటీ అందుకుంటున్న చిత్రం పుష్ప 2. యూనివర్సల్ గా సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ.. మాస్ బీభత్సం సృష్టిస్తున్న పిస్తా చిత్రం ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తుందో అనే సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో స్ట్రీమింగ్ చేయబోతుంది.
తజాకా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేయడంతో స్ట్రీమింగ్ తేదీ పై అందరి దృష్టి నెలకొని ఉంది. కేవలం టెలికాస్ట్ చేస్తున్నాము అని ప్రకటించిన నెట్ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా డేట్ ని మాత్రం అనౌన్స్ ప్రస్తుతం థియేటర్లో విడుదలైన నాలుగు నుంచి ఆరు వరాల లోపు సినిమాలు ఆన్లైన్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు అంతకంటే ముందే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అయితే థియేటర్లో ఎక్కువ రోజులు ఆడుతున్న చిత్రాల ఓటీటీ విడుదల తేదీ పై మాత్రం కాస్త స్పష్టత తక్కువగానే ఉంటుంది. ఇక పుష్ప చిత్రం విడుదలైన ఐదు వారాల తర్వాత అంటే జనవరి 9న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికి కూడా ఈ చిత్రం థియేట్రికల్ రన్ మంచి ఆక్యుఫెన్సీ తో కొనసాగుతున్న నేపథ్యంలో ఓటీటీ లో మూవీని లేటుగా విడుదల చేసే అవకాశం ఉంది.
అయితే మరోపక్క సంక్రాంతి సినిమాలు దిగితే పుష్ప కి క్రేజ్ బాగా తగ్గుతుంది.. కాబట్టి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి అని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం బీభత్సమైన కలెక్షన్స్ తో అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు వెళుతున్న పుష్ప థియరీటికల్ రన్ పూర్తి చేసుకునే లోపు మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఇక ఈ మూవీ సంక్రాంతికి సందడి చేసే అవకాశాలు ఎక్కువ అన్న టాక్ రావడంతో సినీ లవర్ లు చాలా హ్యాపీగా ఉన్నారు. పుష్ప 2 ఆన్లైన్ స్ట్రీమింగ్ పై త్వరలోనే నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.