ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి పుష్ప 2 సినిమా తెలుగు సినీ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తక్కువ రోజుల్లోనే రూ.1850 కోట్ల గ్రాండ్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీలో భారీ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ చిత్రం, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రం ‘దంగల్’ను తక్కువ సమయంలోనే దాటాలని లక్ష్యంగా పెట్టుకుని దూసుకుపోతోంది.
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం నార్త్ ఆడియన్స్ అని చెప్పవచ్చు. సగానికి పైగా కలెక్షన్లు నార్త్ ఇండియా నుంచి వచ్చినట్లు సమాచారం. ఇకపోతే, జనవరి 17 నుంచి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ విడుదల చేయడంతో అందులో మరో 20 నిమిషాల అదనపు సన్నివేశాలు జత చేయడం జరిగింది.
ఇప్పటికే థియేటర్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఓటీటీలో పుష్ప 2ను వీక్షించే ప్రేక్షకులకు మరో సర్ప్రైజ్ గా 10 నిమిషాల అదనపు ఫుటేజ్ జత చేయబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫుటేజ్ ఇప్పటివరకు థియేటర్లలో చూపించనందున ప్రేక్షకులకు మరో కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. థియేటర్లో 3:35 గంటల నిడివితో అలరించిన ఈ సినిమా, ఓటీటీలో 3:45 గంటల నిడివితో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోబోతోంది.
అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రత్యేక గీతంలో నటించి, తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది. పుష్ప 1లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఈ సినిమాలో శ్రీ లీల కూడా తన ఐటమ్ సాంగ్ తో అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
ఇక అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తో ఆయన బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం థియేటర్లలో మాత్రమే కాదు, ఓటీటీలో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.