దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తోంది. కనివిని ఎరుగని భారీ టికెట్ ధరలతో బరిలోకి దిగిన ఈ చిత్రం రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ కొల్లగొడుతోంది. మొదటి నుంచి మంచి పాజిటివ్ బజ్ తో తెరకెక్కిన ఈ చిత్రం సుకుమార్ మార్క్ మాస్ ఎలివేషన్స్ తో అభిమానులను సంతోష పెడుతుంది.
ఇక ఆ విషయం కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం ఓటీటీ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. చాలామంది ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఎక్కువ సార్లు చూసే బసతి లేదు.. మూవీలో సీన్స్ ఏమో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ స్ట్రీమింగ్ లో అయితే రిపీటెడ్ గా ఎక్కువ సార్లు చూడవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది ఈ చిత్రం ఎప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక పుష్ప 2 ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను నెట్లిక్స్ సంస్థ 270 కోట్ల ఫ్యాన్సీ రేట్ కు దక్కించుకుంది. సూపర్ హిట్ టాక్ తో ముందుకు వెళ్తున్న ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీ లో ప్రసారమవుతుందో తెలుసుకుందాం పదండి..
సాధారణంగా సినిమాలు విడుదలైన 30 నుంచి 45 రోజులలో లోపే ఆన్లైన్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తాయి. అయితే చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ సాధించి.. ఎక్కువ రోజులు మంచి థియేటర్ ఆక్యుఫెన్సీ తో నడిస్తే.. ఆన్లైన్లో మూవీ వచ్చే డేట్ కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రానికి తెలుగు మార్కెట్లోనే కాక మిగిలిన మార్కెట్లలో కూడా పెద్ద పోటీ లేదు. అయితే సంక్రాంతి సినిమాలు వస్తే మాత్రం థియేటర్లు కాస్త ఇబ్బంది అవుతుంది.
అంటే సంక్రాంతి వరకు ఈ చిత్రం థియేటర్లలో కచ్చితంగా ఆడుతుంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ సంక్రాంతికి లేదంటే సమ్మర్ కి ఓటిటిలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది అన్న టాక్ నడుస్తోంది.