భారీ అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ థియేటర్లలో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయింది. విడుదలకు ముందు నుంచే భారీ హైప్ సృష్టించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం..
మూవీ: పుష్ప: ది రూల్’
నటీనటులు: అల్లు అర్జున్,రష్మిక,ఫాహద్ ఫాజిల్,రావు రమేష్,జగపతిబాబు,సునీల్,అనసూయ,జగదీష్ భండారి,ఆదిత్య మీనన్,తారక్ పొన్నప్ప,అజయ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: రవిశంకర్ యలమంచిలి,నవీన్ యెర్నేని కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్
స్టోరీ: పుష్ప 2 కి ముందు విడుదలైన పుష్ప స్టోరీ ఏంటో మనందరికీ తెలుసు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో గ్యాంగులు, గ్యాంగ్ వార్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరం చూసాం. ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే మొదటి భాగం ఎండింగ్ పుష్ప పెళ్లి, షెకావత్ తో అతని గొడవతో ముగుస్తుంది. ఇక ఈ పార్ట్ లో ఈ ఇద్దరి గొడవ ఏ రేంజ్‌కి వెళ్తుంది అన్న ఆసక్తికరమైన విషయాన్ని మనం చూడవచ్చు.
ఇక ఏ మూవీలో పుష్పరాజ్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు.. మరీ ముఖ్యంగా జాతర సన్నివేశంలో అల్లు అర్జున్ నటన వేరే లెవెల్ లో ఉంది. ఇక శ్రీవల్లి గారు రష్మిక అందరిని మెస్మరైజ్ చేసింది. మూవీలో యాక్షన్స్ సన్నివేశాలు ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. సుకుమార్ సినిమాల్లో మాస్ ఎలివేషన్ ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాస్ బీభత్సం సృష్టిస్తుంది.
ఇక ఈ చిత్రంలో రెండు సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. తన మనుషులను అరెస్టు చేసిన షెకావత్ స్టేషన్ కి వెళ్లి ఎటువంటి విధ్వంసం సృష్టించకుండా పుష్పాతన మనుషుల్ని విడిపించుకొస్తాడు. ఈ సన్నివేశం తీవ్ర ఉత్కంఠతతో ముందుకు సాగుతుంది. నెక్స్ట్ తన చేతిలో అవమానానికి పగబట్టిన షెకావత్.. తన వ్యాపార సామ్రాజ్యం జోలికి రాకుండా ఉండాలి అంటే ఒక్కసారి చెబితే సరిపోతుంది.. అయితే ఆ సిచువేషన్ లో పుష్ప ఏం చేస్తాడు అనేది మూవీకి హైలైట్ గా నిలిచింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతి సీన్ ఒక అద్భుతం అనే చెప్పాలి. కాబట్టి లేట్ చేయకుండా థియేటర్‌కు వెళ్లి సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేయండి.
రేటింగ్: 3.25/5