సినీ లవర్స్ పెరుగుతున్న కొద్ది సినిమా చూసే విధానాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలు విడుదల అయితే వారాంతరాలను వెళ్లి చూడడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు సినిమా ఫస్ట్ చూడడం ఒక ట్రెండ్గా మారుతుంది. ఈ నేపథ్యంలో సినిమా ఓపెనింగ్స్ మొదటి మూడు రోజుల్లో బుకింగ్స్ అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జోరుగా సాగుతున్న బిజినెస్ ను మరింత పెంచడానికి టికెట్లు రేట్లు భారీగా పెంచుతూ వస్తున్నారు.
ఇక రెండు రోజుల్లో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం టికెట్ రేట్లు భారీగా పెరగడంతో అభిమానులు ఇరకాటంలో పడ్డారు. నైజంలో భారీగా టికెట్ రేటు పెంచడానికి ఈ చిత్రానికి అనుమతులు లభించిన నేపథ్యంలో ఆంధ్రాలో కూడా ఇదే రకంగా టికెట్ రేట్లు ఉండే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో పుష్ప 2 మొదటి వారం రోజులు చూడాలి అంటే కచ్చితంగా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి జోబికి చిల్లు పడడం ఖాయం. ముందు రోజు ప్రీమియం చూడడం కంటే ఓ ఐఫోన్ కొనుక్కోవడం మేలు అనడం బెటర్ అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి మారింది.
మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను మించి ఈ చిత్రం ముంబైలో టికెట్లు కొనాలి అనుకునే వారికి చుక్కలు చూపిస్తోంది. ప్రత్యేక స్క్రీన్ లో ఈ చిత్రం చూడాలి అంటే ఏకంగా 3000 రూపాయలు చెల్లించాలి. ముంబైలో మైసన్ PVR, జియో వరల్డ్ డ్రైవ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో నడిచే మల్టీప్లెక్స్ థియేటర్లలో.. సాధారణ టికెట్ 700 రూపాయలు ఉంటే స్పెషల్ స్క్రీన్ లో చూడాలి అంటే ఏకంగా మనిషికి 3000 అవుతుంది. సాధారణంగా బాలీవుడ్ కి చెందిన బడా హీరోల సినిమాలు మాత్రమే ఈ స్క్రీన్స్ లో ఈ రేంజ్ లో స్క్రీనింగ్ అవుతాయి.
దీన్నిబట్టి పుష్ప రాజ్కు నార్త్ లో ఎటువంటి ఫాలోయింగ్ ఉందో అర్థం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు టికెట్లు అమ్ముడుపోగా విడుదల తేదీ లోపు మొత్తం టికెట్లు అయిపోతాయని అంచనా. మొత్తానికి పుష్ప రాజ్కు తెలుగు రాష్ట్రాల కంటే కూడా నార్త్ లోనే మార్కెట్ భారీగా ఉంది అని అర్థమవుతుంది. గతంలో వచ్చిన పుష్ప 1 మూవీ ఎటువంటి ప్రమోషన్ లేకుండానే అక్కడ సుమారు 100 కోట్లకు పైగా వసూలు చేసింది.. ఈ నేపథ్యంలో రాబోయే పుష్ప 2 ఈ ప్రాంతం నుంచి 500 నుంచి 750 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతేకాదు మొదటి రోజు ఈ చిత్రం 300 నుంచి 400 కోట్ల వసూలు నమోదు చేసి రికార్డు స్థాయిలో డే వన్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది అని అందరూ భావిస్తున్నారు.