అల్లు అర్జున్, సుకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా ఈ ఇద్దరి పేర్లు భారీగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మూడు సంవత్సరాల కష్టం నేడు పుష్ప 2 రూపంలో ఘన విజయాన్ని అందుకుంటుంది. వేయి కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన ఈ చిత్రం తొలి రోజునుంచే రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 130 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం టికెట్లు కూడా భారీ స్థాయిలోనే అమ్ముడుపోతున్నా. బుక్ మై షో ఆప్ లో ఈ మూవీకి సంబంధించిన టికెట్స్ హాట్ కేక్స్ లా సేల్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇప్పటికే 24 గంటల్లో ఈ మూవీకి సంబంధించి బుక్ మై షో ఆప్ లో మిలియన్ కి పైగా టికెట్లు అమ్ముడు అయ్యాయి. గంట గంటకు టికెట్ బుకింగ్ సంఖ్య పెరుగుతూ సునామీని తలపిస్తోంది. ఒక టైం లో అయితే గంటకు 98 వేల టికెట్లు అమ్ముడు అయ్యాయి.. దీంతో ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. పుష్ప 2 మూవీ సత్తా ఏమిటో చూపించడానికి ఈ నెంబర్లే సాక్ష్యం అంటూ అల్లు అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
డే వన్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. వీకెండ్ కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడు కావడం.. భారీ మొత్తంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడం తో మూవీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అయితే వీకెండ్ అయిన తర్వాత ఈ మూవీ పరిస్థితి ఏమిటి అన్న విషయంపై కూడా సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి. వారం మధ్యలోనే టికెట్ బుకింగ్ ఇలా ఉంటే.. ఇక వీకెండ్ లో టికెట్లు దొరకడమే కష్టమైపోతుందేమో అని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద రాబోయే చిత్రాలకు భారీ టార్గెట్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.