ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా విడుదలైనప్పటి నుండి రికార్డులు సృష్టిస్తూ ముందుకుసాగుతోంది. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ పరంగా 640 కోట్ల రూపాయలు సాధించింది. ఇది ఇండియాలోనే అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. సినిమా విడుదల ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనగా, విడుదల తర్వాత ఆ అంచనాలను మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మొదటి రోజు ఏకంగా 275 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించింది. ప్రారంభ ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకోవడం విశేషం. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు గొప్ప ఆదరణ చూపించగా, హిందీ వెర్షన్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. హిందీలోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టగా, అందులో 800 కోట్లకు పైగా వసూళ్లు నార్త్ ఇండియాలోనే వచ్చాయి.
లాంగ్ రన్‌లో కూడా ‘పుష్ప 2’ తన జోరును నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి, ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన ఈ చిత్రం, మొత్తం గ్రాస్ కలెక్షన్లలో ‘దంగల్’ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది.
ఇదే సమయంలో, దేశీయ మార్కెట్లో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించింది. ట్రేడ్ అనలిస్టులు ఈ సినిమాకి దక్కుతున్న ఆదరణను విశ్లేషిస్తూ, రాబోయే రోజుల్లో ఈ రికార్డులను మించే అవకాశం చాలా తక్కువగా ఉన్నదని అభిప్రాయపడ్డారు.
భారీ కలెక్షన్లతో టాప్ 10 భారతీయ సినిమాలు:
1. దంగల్ – 2024 కోట్లు
2. పుష్ప 2 – 1831 కోట్లు
3. బాహుబలి 2 – 1810 కోట్లు
4. ఆర్ఆర్ఆర్ – 1387 కోట్లు
5. కేజీఎఫ్ చాప్టర్ 2 – 1250 కోట్లు
6. జవాన్ – 1159 కోట్లు
7. కల్కి 2898ఏడీ – 1150 కోట్లు
8. పఠాన్ – 1050 కోట్లు
9. బజరంగీ భాయ్ జాన్ – 918.18 కోట్లు
10. యానిమల్ – 913.82 కోట్లు
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ‘పుష్ప 2’ భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. ఈ సినిమా రికార్డులు తలదన్నేందుకు మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చు.