టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కెరీర్ లోనే అత్యంత సంచలనమైన సక్సెస్ అందించిన మూవీ పుష్ప 2. విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదల
అయిన అన్ని సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుని ప్రేక్షకులను అలరిస్తోంది.
భారీ ప్రీ రిలీజ్ బిసినెస్ తో బరిలోకి దిగ్గిన ఈ మూవీ అంచనాలను మించి పెరఫామ్ చేస్తోంది. 2021 లో వచ్చిన పుష్ప: ది రైజ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ లో ప్రతి సన్నివేశం థియేటర్స్ లో గూస్ బంప్స్ క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప ఫ్రాంచైజ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తూ మేకర్స్ పార్టీ 3 కూడా తీయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్నీ సెకండ్ పార్ట్ చివర్లో కన్ఫర్మ్ చేసేశారు.
నిజానికి పుష్ప-2 రిలీజ్ కు ముందే నెక్ట్స్ పార్ట్ ఉంటుందనే విషయం లీక్ అయింది. అయితే ఆ తర్వాత చిత్ర బృందం నుంచి ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో పుష్ప 3 ఉండదు అని అందరూ భావించారు. అయితే అనుకోకుండా లీక్ అయిన ఓ పోస్ట్ బ్యాక్ గ్రౌండ్లో పుష్ప– 3 ది ర్యాంపేజ్ అని ఉన్న టైటిల్ని చూసాకే అందరికీ థర్డ్ పార్ట్ ఉంటుంది అన్న ఆశ పెరిగింది.
పుష్ప 2 విడుదలైన తరువాత పార్ట్-2 క్లైమాక్స్లో.. రాబోయే సీక్వెల్ పై కాస్త స్పష్టత ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ క్లైమాక్స్లో పుష్పరాజ్ పై ఓ వ్యక్తి బాంబుదాడికి పాల్పడినట్లు చూపిస్తారు.. అలా రాబోయే నెక్స్ట్ పార్ట్ కి ఓ చిన్న లీడ్ ఇచ్చి వదిలారు. దీంతో పుష్ప 3 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అన్న విషయంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొని ఉంది.
అయితే ఈ మూవీ షూటింగ్ మరో రెండు సంవత్సరాల వరకు మొదలయ్యే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. కుదిరితే 2026 చివరిలో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ లైన్ అప్ లో భారీ చిత్రాలు ఉన్నాయి.. ముందు ఆ కమిట్మెంట్స్ పూర్తయ్యాకే పుష్ప 3 షూటింగ్లో అతను పాల్గొంటాడు. గత ఐదు సంవత్సరాలుగా ఈ మూవీకే డెడికేట్ అయిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. త్వరలో వీటికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి అప్పటివరకు పుష్ప అభిమానులు కాస్త ఓపిక పట్టాల్సిందే.