రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న అల్లు అర్జున్ పుష్ప2 టికెట్ రేట్లు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక పెయిడ్ ప్రీమియంల పరిస్థితి చూస్తే మరీ భయంకరంగా ఉంది.. ఇంతవరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో కానీ విని ఎరుగని రీతిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇవ్వడంతో పుష్ప టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి బ్లాక్ లో టికెట్లు కొనాలి అంటే ఇక కిడ్నీలు అమ్ముకోవాల్సిందే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 4న చాలా స్క్రీన్స్ లో ఈ చిత్రం భారీగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం భారీగా పెంచిన టికెట్ రేట్లతో షోలు నడిపిస్తే పావు బడ్జెట్ వరకు ఒక్కరోజులోనే వసూల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో 1200 రూపాయలు ఒక్క టికెట్ కోసం ఖర్చు చేసి ఈ సినిమా చూడాలా? అని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒకరకంగా తీసుకుంటే అల్లు అర్జున్ అభిమానులు తప్ప మిగిలిన సినీ లవర్స్ ఎవరు కూడా అంత భారీ మొత్తం ఈ మూవీ కోసం పెట్టడం కష్టమే.
ఒక వారం రోజులు ఓపిక పడితే టికెట్ ధరలు ఎలాగో తగ్గుతాయి.. అంతమాత్రానికి ఇంత ఖర్చు పెట్టాలా అనే వారు కూడా ఉన్నారు. ఇక కాసేపు ఈ విషయం పక్కన పెడితే తాజాగా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మైత్రి నిర్మాతలకు ఎన్నడూ ఎరుగని విధమైన ఓ కొత్త అనుభూతి ఎదురైంది.
ఇక స్టేజి పైకి మాట్లాడడానికి వచ్చిన నిర్మాతల్ని ఓ అభిమాని పెరుగుతున్న టికెట్ రేట్ల గురించి నేరుగా నిలదీశాడు. ఏం సార్ మరి 1200 రూపాయలు పెట్టి సినిమా చూడాలా? అని ఓ అభిమాని అందరి ముందు ప్రశ్నించడంతో రవి గట్టిగా నవ్వారు. తనకేం సంబంధం లేదు నవీన్ ని అడగమన్నట్లు సరిగా చేస్తూ ఉండిపోయారు. అంతే తప్ప మైక్ లో ఆ విషయం గురించి ఎవరు స్పందించలేదు. భారీగా పెంచిన పుష్ప 2 టికెట్ రేట్ల గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న చిత్ర బృందం నుంచి ఒక్క చిన్న రెస్పాన్స్ కూడా ఇప్పటివరకు రాలేదు.
సింగిల్ స్క్రీన్ విషయానికి వస్తే టికెట్ ధర 400 వరకు ఉండగా.. మల్టీప్లెక్స్ అయితే 600 పైనే ఉండేలా ఉన్నాయి. చిత్రంపై ఈ టికెట్ల రేట్లు పెంపు ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మొదటి షో టాక్ కాస్త తారుమారు అయితే ఇక సినిమా పరిస్థితి అంతే.. పొరపాటున కూడా జనాలు అటువైపు వెళ్ళరు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి..