పుష్ప 2 విడుదల దగ్గర పడడంతో చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ రోజుకొక అప్డేట్ తో సినిమాపై మంచి బజ్ నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కుర్చీలో సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. సాధారణంగా బన్నీ ఏ సినిమా కోసం ఎక్కడ ఈవెంట్ చేసినా.. అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారు. నిన్న మొన్నటి వరకు ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అని అందరూ భావించారు.
అయితే నిన్న కేరళలోని కొచ్చిలో.. పుష్ప రాజ్ కోసం తరలివచ్చిన అభిమానులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా బన్నీకి ఇంత ఫాలోయింగ్ ఉందా అని అందరికీ మతిపోతుంది. పాట్నా, చెన్నై తో పాటు ఇప్పుడు కొచ్చిలో కూడా బన్నీ అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో మొత్తం ప్రపంచానికి తెలిసింది. కొచ్చిలో నిర్వహించిన ఈవెంట్ వేదిక సాక్షిగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులకు బన్నీ ఓ పెద్ద ప్రామిస్ చేశాడు.
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన నాటి నుంచి గత 20 సంవత్సరాలుగా తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఈ వేదిక సాక్షిగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇక మలయాళ ప్రేక్షకులు తనని ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక పాట అన్ని భాషల్లోనూ మలయాళ లిరిక్స్ తోనే ప్రారంభమయ్యే విధంగా సిద్ధం చేస్తాము అని అన్నారు.
ఫీలింగ్స్ అంటూ ప్రారంభమయ్యే ఆ పాటను ప్లే చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా పుష్ప 1 మూవీ గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్యను కూడా చేశాడు బన్నీ. నిజానికి పుష్ప చిత్రంలో పెద్దగా డాన్స్ చేసే సాంగ్స్ లేవని.. ఆ లోటు ఈ పాటతో తీరుతుందని పేర్కొన్నాడు. ఇక మలయాళ అభిమానులపై తనకు ఉన్న అభిమానాన్ని బన్నీ ఇలా ప్రత్యేకంగా చాటుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
బన్నీ నిజానికి పాన్ ఇండియా స్టార్ కాక ముందు నుంచే మలయాళం లో అతను చిత్రాలకు భారీ ఎత్తున క్రేజ్ ఉంది. అంతేకాదు కేరళలో ఎప్పుడైనా ఏవైనా విపత్తులు జరిగితే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది కూడా బన్నీనే.