డిసెంబర్ నెల దగ్గర పడుతుంది అంటే ఎక్కడ చూసినా పుష్ప ఫీవర్ కనిపిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కిన పుష్ప 2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక చిత్ర బృందం ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ మూవీ పై బజ్ మెయింటెయిన్ చేస్తోంది. పుష్ప 1 ను మించి పుష్ప 2 స్టోరీ ఉంటుంది అని సుకుమార్ స్ట్రాంగ్ గా చెప్పారు. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.
పుష్ప 1తో పోలిస్తే పుష్ప 2 లో స్టోరీ తో పాటు విలన్లు కూడా సాలిడ్ గానే ఉన్నారని టాక్. ఇక ఈ మూవీలో ఫైట్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో గంగమ్మ జాతర సీన్ చూస్తే అర్థమవుతుంది. పుష్ప 1 లో ఫైటింగ్ సీన్స్ కంటే కూడా మిగిలిన సీన్స్ ఎక్కువ.. అయితే ఇప్పుడు రాబోతున్న సీక్వెల్ చిత్రంలో బన్నీ ఫాన్స్ కుష్ అయ్యే రేంజ్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయట.ఈ నేపథ్యంలో పుష్ప గాడి లైఫ్ లో విలన్లు ఎవరు అన్న విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
భన్వర్ సింగ్ షెకావత్:
పుష్ప 1 మూవీ క్లైమాక్స్ షెకావత్, పుష్ప మధ్య జరిగే ఓ ఇంటెన్స్ సన్నివేశంతో ముగుస్తుంది. రెండవ పార్ట్ లో ఈ ఇద్దరి మధ్య ఓ పెద్ద రివెంజ్ సీక్వెన్స్ నడుస్తుందట.మై హూ డాన్ అంటూ ట్రైలర్లో షెకావత్ ఎంట్రీ హైలెట్గా నిలిచింది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీలో షెకావత్ ఎంత బీభత్యాన్ని సృష్టిస్తాడో అర్థమవుతుంది.
మంగళం శీను:
పుష్ప ఎంట్రీ ఇచ్చే అంతవరకు స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రారాజుగా వెలిగిన మంగళం శీను.. ఫస్ట్ పార్ట్ లో చాలా డౌన్ అవుతాడు. తన తమ్ముడిని చంపిన పుష్ప మీద కోపంతో అతని భార్య మంగళం శీను పీకను బ్లడ్ తో కోసి చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇది మనం ఫస్ట్ పార్ట్ లో చూసిన సీన్.. అయితే సెకండ్ పార్ట్ లో మంగళం శీను ఓ రేంజ్ లో పుష్పపై పగ తీర్చుకునే దానికి ట్రై చేస్తాడు అని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఎటువంటి సన్నివేశాలు ఉంటాయి అనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది.
జాలి రెడ్డి:
మొదటి పార్ట్ లో పుష్ప దెబ్బకి వీల్ చైర్ కి పరిమితమైన జాలిరెడ్డి.. రెండవ పార్ట్ లో తనకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాడా.. లేక తన అన్న జక్కారెడ్డిని కాపాడినందుకు పుష్ప తో సంధి చేసుకుని అతనికి రక్షణగా నిలుస్తాడా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
అరగుండు:
ఇక వీళ్ళతోపాటు పుష్ప అన్నలిద్దరూ మొదటి నుంచి అతను అంటే విరుద్ధంగానే ఉంటారు, ఇక తాజాగా అరగుండుతో జాతర సమయంలో కనిపించిన శ్రీ తేజ పుష్ప లైఫ్ లో ఎటువంటి తుఫాను తెస్తాడో చూడాలి. విలన్ల లిస్టు తెలిసే కొద్ది పుష్ప ఇంత మందితో ఎలా పోరాడుతాడు చూడాలి అన్న ఆరాటం కూడా మూవీ లవర్స్ లో పెరిగిపోతుంది. డిసెంబర్ 5 చిత్రం విడుదలైన తర్వాత ఈ సస్పెన్స్ కి తెరపడుతుంది అని అందరూ భావిస్తున్నారు.