Wednesday, September 22, 2021

కాజల్ ని టార్గెట్ చేసిన అభిజిత్ అభిమానులు.. కారణం అదే

బిగ్ బాస్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదుచూస్తున్న బిగ్ బాస్ 5 సీజన్ వచ్చేయడంతో టీవీకే పరిమితం అవుతున్నారు. ఈ సీజన్ లో 19 మంది సభ్యులు పాల్గొటుండగా అందులో ప్రతి ఒక్కరూ టైటిల్ దక్కించుకోవాలని పట్టుదలతో తమ గేమ్ మొదలు పెట్టారు. ఈ సారి యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, ఆర్జే కాజల్, యాంకర్ లోబో, ప్రియాంక సింగ్, లహరి, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వ, సింగర్ శ్రీరామచంద్రలు హౌస్‌ లోకి తమదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు.

వీరిలో ప్రముఖ రేడియో జాకీ కాజల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ లో షో జరిగే తీరు పై విమర్శలు గుప్పించిన కాజల్ కి అవకాశం దక్కడంతో అందరి ద్రుష్టి ఆమెపై పడింది. బిగ్ బాస్ పై ఆమె గత కొంత కాలంగా రివ్యూలు కూడా ఇచ్చింది. అంతే కాకుండా వచ్చిన దగ్గర నుండి ఆమె ఎదో ఒక వివాదంలో ఉంటుంది. ముఖ్యంగా అన్ని విషయాల్లో తల దూర్చి హిత బోధనలు చేయడం.. చివరికి వారితో తిట్లు తినడం కాజల్ పై నెగెటివ్ ఇంప్రషన్ క్రియేట్ అవుతుంది.

అంతే కాకుండా గత సీజన్ లో అభిజిత్ సరిగా ఆడక పోయినా అతడికి ఓట్లు ఎలా వస్తున్నాయని బహిరంగానే ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు కాజల్ పెట్టిన పోస్ట్ లను షేర్ చేస్తూ అభిజిత్ ఫాన్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓట్లు పడేది కూడా అనుమానంగా మారింది. అయితే మరి కొంత మంది మాత్రం ఇందుకు బిన్నంగా సమాధానం చెబుతున్నారు. కాజల్ అందంగా ఉందని, అందుకే ఆమెని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. యువత ఎక్కువగా కాజల్ కి ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.

Latest Articles