టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రెండు సంవత్సరాలైనా, ఫ్యాన్స్ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల రాజమౌళి కొబ్బరికాయ కొట్టి షూటింగ్‌కు ముహూర్తం పెట్టారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చి లుక్ టెస్ట్‌లో పాల్గొన్నారు. లుక్ టెస్ట్ పూర్తయిన వెంటనే రాజమౌళి, ఆమెకు బల్క్ డేట్స్ అడిగినట్టు తెలుస్తోంది. మొదట్లో ప్రియాంక ఈ విషయంలో ఇబ్బంది పడినప్పటికీ ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుండటంతో సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో ఈ సినిమాను రూపొందించనున్నారు.
ఫారెస్ట్ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో వర్క్‌షాప్ జరుగుతోంది. మహేష్ బాబు లుక్ పూర్తిగా మారిపోయి, కొత్తదనంతో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల చివర్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
ప్రీ ప్రొడక్షన్ పనులను రాజమౌళి ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లేకుండా పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2027లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
ఈ చిత్రానికి దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. లె. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబోతో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా, హాలీవుడ్ స్థాయిలో కూడా పెద్ద సినిమాగా నిలవనుందని అంచనా. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతుండటంతో మరింత ఆసక్తి పెరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌తో రాజమౌళి తన దృష్టిని గ్లోబల్ ఆడియెన్స్‌పై పెడుతున్నారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.