తెలుగు సినిమా పవర్ ఏమిటో ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాలను పాన్ ఇండియా రేంజ్కి బ్రాండ్స్ గా మార్చాడు జక్కన్న. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో అతను తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సంచలనంగా మారారు. దీంతో జక్కన్న తదుపరి చిత్రాలపై హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
రాజమౌళి కెరీర్ లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చిన అతని డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం ఒకటి ఉంది.. అదే మహాభారతం. ఈ విషయం జక్కన్న అభిమానులు అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాల క్రితమే రాజమౌళి మహాభారత కావ్యాన్ని తెరకెక్కించడం తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నారు. బాహుబలి లాంటి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రాజమౌళి నిజంగా మహాభారతాన్ని తీస్తే అది మరొక విజువల్ వండర్ అనే చెప్పాలి.
మరోపక్క రాజమౌళి సినిమాలు తీసే స్టైల్ తెలిసిన ఎందరో ఒకవేళ రాజమౌళి మహాభారతం తీస్తే అది ఒకటి రెండు భాగాలు ఉండదని.. ఏకంగా ఓ పది భాగాలు ఉంటుందని అంటున్నారు. జక్కన్న సినిమాల్లో ఖచ్చితంగా రామాయణానికి, మహాభారతానికి సంబంధించిన ఏదో ఒక ఎగ్జాంపుల్ ఓ మంచి డైలాగ్ రూపంలో మనం వింటూనే ఉంటాం. ప్రస్తుతం జక్కన్న తన డ్రీం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
ఈ నేపథ్యంలో మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు ఓ బాలీవుడ్ స్టార్ హీరో. భారతీయ చిత్ర పరిశ్రమలు హైయెస్ట్ గ్రాస్ ఉన్న ఏకైక హిందీ హీరో అమీర్ ఖాన్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మిస్టర్ పర్ఫెక్ట్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ సినిమాలంటే తెలుగు వారికి కొత్త ఏమీ కాదు.. ఆయన తీసే సినిమాలు ఎంత డెడికేషన్ తో కూడుకొని ఉంటాయో అందరికీ తెలుసు. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎవరి డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది అన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది.