దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రంతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు జక్కన్న. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో రాజమౌళి పేరుకి, ఆయన తీసే సినిమాలకి డిమాండ్ వేరే లెవెల్ లో ఉంది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆయన తెరకెక్కించిన “రౌద్రం రణం రుధిరం” .. అదేనండి ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఈ చిత్రం ఆస్కార్ వేదికపై అందరినీ అలరించింది.
ఈ మూవీ అందించిన విజయంతో తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి “RRR: బిహైండ్ & బియాండ్” అనే డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ థియేటర్లలో విడుదలవుతుంది అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే.. ఎన్నో ఇంటర్వ్యూ.. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఎన్నో విషయాలు.. హీరో హీరోయిన్ల అభిప్రాయాలు.. ఇలా సినీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసే విషయాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ బిట్లుగా చూడడానికి.. లేదా ఇంస్టాగ్రామ్ లో చిన్న వీడియోలుగా తిలకించడానికి అందరూ ఇష్టపడతారు. అయితే వీటిని అన్నిటిని కలిపి ఓ డాక్యుమెంటరీగా తీసి థియేటర్లో విడుదల చేస్తే దాన్ని ఎంతవరకు ఆదరిస్తారు అనే విషయం ప్రస్తుతం ప్రశ్న లేవనెత్తుతోంది.
అంతేకాదు ప్రస్తుతానికి ఈ డాక్యుమెంటరీని ఇంగ్లీషులో విడుదల చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీని తెలుగు, హిందీ లాంటి భాషలలో కూడా అనువదించి వదులుతారా లేక ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ వదులుతారా అన్న విషయంపై స్పష్టత లేదు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం వెనుక కథ తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్ కి ఉంటుంది.. కానీ భాష పరిమితితో డాక్యుమెంటరీని విడుదల చేస్తే దాన్ని ఎంతవరకు ఆదరిస్తారు అనే విషయం తెలియదు. ఇదే డాక్యుమెంటరీని ఓటిటి లేదా యూట్యూబ్‌లో విడుదల చేస్తే ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తన రికార్డ్‌లో లేని రాజమౌళి ఈ డాక్యుమెంటరీ థియేటర్లో విడుదల చేసి హిట్ సాధిస్తారా లేక తన రికార్డులో మొట్టమొదటి ఫ్లాప్ ని చవిచూస్తారా అన్న విషయం చూడాలి.