తెలుగు సినిమాలకు మార్కెట్ విలువ పెంచుతూ పాన్ ఇండియా రేంజ్ లో వాటికి డిమాండ్ ఏర్పడేలా చేసింది రాజమౌళి అనడంలో సందేహం లేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారి అందరి దృష్టి టాలీవుడ్ వైపు మల్లెల చేశాడు. దీంతో ఇప్పుడు చిన్న సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తోంది. అయితే దీని ప్రభావం రాబోతున్న తెలుగు చిత్రాలపై భారీగా పడుతుంది అని సినీ అభిమానులు బాధపడుతున్నారు.
ఇంతకుముందు బడా హీరోల సినిమాలు ఒక్క చిత్రంతో పూర్తయిపోయేవి. మంచి సాలిడ్ కంటెంట్‌తో స్టోరీ ఎండింగ్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అయితే ఈ రెండు భాగాల పుణ్యమా అంటూ సినిమాల లెంగ్త్ పెరగడంతో పాటు కంటెంట్ తగ్గిపోతుంది. ఒకరకంగా టాలీవుడ్లో సీక్వెల్ చిత్రాలకు శ్రీకారం చుట్టింది మాత్రం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. అప్పట్లో ఆయన మనీ, మనీ మనీ అలాగే రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 వంటి సీక్వెల్ చిత్రాలను తెరకెక్కించారు.
అయినా అప్పట్లో పెద్దగా సీక్వెల్ చిత్రాల జోలికి ఎవ్వరూ పోయే వాళ్ళు కాదు. కానీ రాజమౌళి బాహుబలి బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మాండంగా ఆడిన తర్వాత ఈ సీక్వెల్ సంస్కృతి అందరికీ మరింత కిక్ ఇస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సీక్వెల్స్ కాస్త ఏ సినిమాకి సరైన ముగింపు లేకుండా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే రేంజ్‌కి వెళ్ళిపోయాయి. సినిమాకి సరియైన ముగింపు ఇచ్చి.. ఆ తర్వాత సీక్వెల్ తీస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
కానీ పార్ట్ 2 ఉండాలి అనే ఉద్దేశంతో సగం సగం స్టోరీతో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సంవత్సరం విడుదలైన ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’, ‘కల్కి 2898 ఏడీ’ ,’ దేవర ‘సినిమాల పరిస్థితి అలాగే ఉంది. వీటి ఫస్ట్ పార్టీ ఎండింగ్ సంతృప్తికరంగా లేదు అన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన పుష్ప 2 మూవీ ఎండింగ్ పై కూడా ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ పార్ట్ ఉంచాలి అనే ఉద్దేశంతో మూడో భాగానికి లీడ్ ఇస్తూ సెకండ్ పార్ట్ కు సరైన ముగింపు ఇవ్వలేదు అని అందరూ భావిస్తున్నారు. దీంతో రాజమౌళి ఆలోచన తెలుగు సిని ఇండస్ట్రీలో సినిమాల ఎండింగ్ ను నాశనం చేస్తుందని అందరూ భావిస్తున్నారు.